Surya Dev Pooja: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని గ్రహాల రాజు అంటారు. ఎవరి జాతకంలోనైనా సూర్యుడు బలంగా ఉంటే.. ఆ వ్యక్తి జీవితంలో సిరిసంపదలతో పాటు గౌరవం, వైభవం పొందుతారని జోతిష్యులు చెబుతుంటారు. కానీ, సూర్యుడు బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోక తప్పదని అంటుంటారు. అలాంటి పరిస్థితుల్లో సూర్యదేవున్ని ప్రసన్నం చేసుకోవడం ఎంతో ముఖ్యం. జోతిష్య శాస్త్రంలో పేర్కొన్న నివారణల ఆధారంగా సూర్యన్ని ఎలా పూజించాలో తెలియజేస్తున్నాం. అయితే ఆ పూజలు ఆదివారం నాడు చేస్తే జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం ప్రత్యేకం


సూర్యదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఆదివారం కంటే మంచి రోజు మరొకటి ఉండదు. ఈ రోజు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. జాతకంలో సూర్యుడిని బలపరిచే చర్యలు ఆదివారం నాడు చేస్తే.. సూర్యున్ని వెంటనే ప్రసన్నం చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఆ పూజా ఫలితాల ప్రభావం మనం జీవితంలో వెంటనే కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు వ్యాపారంలోనూ వెంటనే పురోగతి లభిస్తుంది. ఐశ్వర్యం, గౌరవం పొందుతారు. 


సూర్యదేవుణ్ణి ఎలా ప్రార్థించాలి?


ఆదివారం ఉదయాన్నే నిద్ర లేవాలి. వీలైతే సూర్యదయానికి ముందే నిద్ర లేస్తే మంచిది. అలా నిద్రలేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని.. శుభ్రమైన బట్టలు ధరించి, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడానికి ఓ రాగి పాత్రలో నీటిని తీసుకొని.. అందులో నీరు, అక్షతలు, ఎర్రటి పూలు, బెల్లం కలపాలి. ఈ పదార్థాలన్నీ సూర్యదేవుడికి ప్రీతిపాత్రమైనవి. 


అందువల్ల అర్ఘ్యం చేసే సమయంలో ఈ పదార్థాలన్నింటీని ఉంచే విధంగా చూసుకోవాలి. అలా చేయడం వల్ల సూర్యుడి ప్రభావం మీ జాతకంపై వెంటనే పడుతుందని నమ్మకం. సూర్యున్ని నమస్కరించే క్రమంలో రెండు చేతుల్లో నీటిని తీసుకొని.. సూర్యభగవానుడు చూసే విధంగా నీటిని వదిలేయాలి. అలా మూడు సార్లు చేయాలి. అలా సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించే సమయంలో ఆ నీటిని మీ పాదాలపై పడకుండా జాగ్రత్త వహించండి. అలా మీ కాళ్లపై పడకుండా.. నీరు పోసే చోట ఖాళీ గిన్నె లేదా ఏదైనా పాత్రను ఉంచాలి. 


ఉపవాసం, పారాయణం


అంతే కాకుండా ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ్ స్తోత్రాన్ని పఠించాలి. దీంతో సూర్యభగవానుడు సంతోషించి భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడని నమ్మకం. వాల్మీకి రామాయణం ప్రకారం.. రావణుడిని చంపే ముందు శ్రీరాముడు విజయం సాధించడానికి ఆదిత్య హృదయ్ స్తోత్రాన్ని కూడా పఠించారు. దీంతో పాటు ఆదివారం ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. అలా ఉపవాసం ఉన్నవాళ్లు ఉప్పు తినకూడదు. 


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా జోతిష్య శాస్త్రం నుంచి గ్రహించబడినది. వీటిని అనుసరించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. ZEE తెలుగు News ఈ సమాచారాన్ని ధ్రువీకరించడం లేదు.) 


Also Read: Todays Horoscope 19th Feb 2022: ఈ రాశివారి నేటి జాతకం ఇలా ఉంటుంది, ఆ రాశివారికి పదోన్నతులుంటాయి


Also Read: Chanakya Niti: ఈ రెండు లక్షణాలు లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా వ్యర్థమే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook