Chanakya Niti: ఈ రెండు లక్షణాలు లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా వ్యర్థమే!

Chanakya Niti: జీవితంలో విజయంతో పాటు ధనవంతులుగా ఎదిగేందుకు రెండు రకాల లక్షణాలు ఉండడం చాలా ముఖ్యమని చాణక్య నీతి చెబుతోంది. ఒకవేళ ఆ రెండు లక్షణాలు లేకుండా ఎంతో డబ్బు, పేరు సంపాదించినా.. కొన్ని రోజుల్లోనే అవి దూరమయ్యే అవకాశం ఉందని అందులో పేర్కొంది. అయితే ధనంతో పాటు కీర్తిప్రతిష్టలు దక్కేందుకు పాటించాల్సిన రెండు లక్షణాలేమిటో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2022, 01:38 PM IST
    • ఐశ్వర్య సిద్ధి కోసం ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి
    • వినయం, మధురమైన మాట వల్ల ధన ప్రాప్తి
    • ఈ రెండు లక్షణాలు లేకుంటే డబ్బు ఎప్పటికీ నిలవదని హితబోధ
Chanakya Niti: ఈ రెండు లక్షణాలు లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా వ్యర్థమే!

Chanakya Niti: జీవితంలో డబ్బు సంపాదించిన త్వరగా సెటిల్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కలగంటుంటారు. కానీ, హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ధనలక్ష్మీ మాత అనుగ్రహం ఉంటేనే ఐశ్వర్యం సిద్ధిస్తుందని పెద్దలు చెబుతుంటారు. కొన్ని స్వయంకృత అపరాధాల వల్ల డబ్బు నష్టం వాటిల్లడం సహజం కానీ.. ఏ పనీ మొదలెట్టినా కొంతమంది నష్టపోతుంటారు. కొన్ని అలవాట్లు, పరిస్థితులను బట్టి కూడా చేయ్యి దాక వచ్చిన డబ్బు కూడా చేజారిపోతుందని చాణక్య నీతి చెబుతోంది. 

చాణక్య నీతి ప్రకారం.. కొన్ని రకాల అలవాట్ల కారణంగానూ ధన ప్రాప్తి లభించదని తెలుస్తోంది. వాటిని మానుకోని.. కొత్త అలవాట్లు అవలంభించుకోవడం వల్ల ధనలక్ష్మీ మాత అనుగ్రహం లభిస్తుందని తెలుస్తోంది. ఇంతకీ ప్రతి మనిషిలో అలవరుకోవాల్సిన ఆ విజయ లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

విజయానికి 2 లక్షణాలు..

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విజయం సాధించడానికి, ధనవంతులుగా ఎదగడానికి.. కృషి, సామర్థ్యంతో పాట అదృష్టం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. కానీ, వీటితో పాటు రెండు కొత్త లక్షణాలను అలవరుచుకోవాలి. అవి లేకుండా జీవితంలో విజయం సాధించడం అసాధ్యం. ఒకవేళ ఓ వ్యక్తి అనేక రూపాల్లో డబ్బును సంపాదించినా.. ఆ రెండు లక్షణాలు లేకుండా డబ్బును చివరి వరకు అలానే కాపాడుకోలేడు. చాణక్యుడు చెప్పిన ఆ రెండు లక్షణాలేమిటో తెలుసుకుందాం. 

1) వినయం

మనిషి తన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ఏ వ్యక్తికైనా వినయం లేకపోతే అతడు జీవితాంతం విజయంతో పాటు డబ్బు పొందలేడు. అహంకారం లాంటి లక్షణాలు ఉండడం వల్ల లక్ష్మీ దేవీ అతడి జీవితంలో ఉండేందుకు ఇష్టపడదు. అలాంటి వ్యక్తిని తన తోటీ వారు కూడా ఇష్టపడరు. అందువల్ల ఏ వ్యక్తి అయిన పదవి, ధనం, పలుకుబడి, గౌరవం పొందేందుకు వినయం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది.

2) మధురమైన ప్రసంగం

మధురంగా ​​మాట్లాడటం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఒక వ్యక్తి తీయగా మాట్లాడటం ద్వారా శత్రువును తన సొంతం చేసుకోవచ్చు. అర్ధాంతరంగా ఆగిపోతుందన్న పని కూడా పూర్తవుతుంది. అదే విధంగా అలాంటి మాటతీరులో అందరి హృదయాలను సులభంగా గెలుచుకోవచ్చు. అందువల్ల.. మీరు మీ లైఫ్ లో విజయంతో పాటు ఐశ్వర్యాన్ని దక్కించుకోవాలంటే పైన పేర్కొన్న రెండు లక్షణాలను అలవర్చుకోవడం మంచిది. 

(నోట్: పైన పొందుపరిచిన సమాచారం చాణక్య నీతి నుంచి గ్రహించినది. వీటిని పాటించే ముందు ఒకసారి జోతిష్య శాస్త్ర నిపుణులను సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు NEWS ధ్రువీకరించడం లేదు.)   

Also Read: Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారి ఆత్మగౌరవం దెబ్బతినే అవకాశం!

Also Read: Vastu Tips: సంసారం సాఫీగా సాగిపోయేందుకు బెడ్ రూమ్ వాస్తు టిప్స్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News