హిందూమతంలో గ్రహాలకు రాజు సూర్యుడిని భావిస్తారు. సూర్యుడు వివిధ రాశుల్లో తిరుగుతూ జనవరి 14వ తేదీ రాత్రి 8.46 నిమిషాలకు మకరరాశిలో ప్రవేశించనున్నాడు. దాదాపు నెలరోజులు మకరంలోనే ఉంటాడు. ఈ క్రమంలో జరిగే పరిణామాలేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా సూర్యుడి మకర రాశి ప్రవేశం కారణంగా ప్రతి రాశి జీవితంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల ఎక్కువ ప్రభావం వృషభరాశిపై పడుతుంది. మనస్సుకు శాంతి చేకూరుతుంది. ఇప్పటివరకూ ఉన్న అనవసర ఆందోళనలు దూరమౌతాయి. పూర్తిగా ఉపశమనం కలుగుతుంది. కెరీర్ కోసం జనవరి 22 వరకూ మంచి అనుకూలమైన సమయంగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ కాలంలో మీకు ఏది లభించినా..అది గతంలో మీరు చేసుకున్న మంచి పనుల ఫలితం. అందుకే మంచి పనులు చేస్తుండాలి. సూర్యుడి రాశి పరివర్తనం కారణంగా ఇతరుల తోడ్పాటు లభిస్తుంది. 


వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు ఈ సమయంలో కేవలం ప్లానింగ్‌పై ఫోకస్ చేయాలి. ఇతర విషయాలు చేపట్టకూడదు. దాంతోపాటు పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. చట్ట విరుద్ధ పనుల్లో చిక్కుకోకుండా చూసుకోవాలి. లేకపోతే జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. సుఖ సౌకర్యాలకై పనిచేసే ఎక్విప్‌మెంట్ బిజినెస్ చేసేవారు చాలా యాక్టివ్‌గా ఉండాలి. మకర సంక్రాంతి నాడు మీ సామర్ధ్యాన్ని బట్టి దానాలు చేయాలి.


ఇంటికి సంబంధించిన రుణాల్నించి విముక్తి లభిస్తుంది లేదా తిరిగి చెల్లించేందుకు చేసే ప్రయత్నాలు విజయవంతమౌతాయి. జనవరి మద్యలోంచి ఫిబ్రవరి ప్రారంభంలో కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశముంది. అధిక రక్తపోటు రోగులు అప్రమత్తంగా ఉండాలి. తలనొప్పి, మైగ్రెయిన్ సమస్య ఎదుర్కోవల్సి వస్తుంది. శరీరక ఒత్తిడి అధికమై మాననిక ఆందోళనను ఎదుర్కోవల్సి వస్తుంది. 


Also read: Shani Asta 2023: శని దేవుడి డేంజర్ బెల్స్.. ఈ రాశుల వారి జీవితాల్లో గందరగోళం! ఇక డబిడదిబిడే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook