Surya Gochar 2024 effect: పురాణాల ప్రకారం, సూర్యభగవానుడు కుమారుడు శని. మకరరాశికి అధిపతి శని. మరో రెండు రోజుల్లో సూర్యుడు తన కుమారుడి రాశి అయిన మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే మకర సంక్రాంతి అంటారు. అదే రాశిలో భాస్కరుడు ఫిబ్రవరి 13 వరకు ఉంటాడు. ఈ సమయంలోనే సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి వెళతాడు. సూర్యుడి రాశి మార్పు వల్ల నాలుగు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకరం
ఇదే రాశిలోకి సూర్యభగవానుడు వస్తాడు. దీంతో మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. రాజకీయాల్లో రావాలనుకుంటే ఇదే తగిన సమయం. విద్యార్థులకు చదువుపై మనసు లగ్నం అవుతుంది. మీ పేదరికం తొలగిపోతుంది. మీరు కెరీర్ లో విజయం సాధిస్తారు.  పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 
మేషం
సూర్యుడి సంచారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి యెుక్క పదో ఇంట్లో సూర్యుడి సంచారం జరగబోతుంది. దీంతో వీరి వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. పాలిటిక్స్ లో ఉన్నవారికి పదవి లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా జాబ్ చేసేవారికి పదోన్నతి రావచ్చు.
వృషభం
సూర్యుడి సంచారం వల్ల వృషభరాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు ఉన్నత స్థానాల్లో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. 
సింహరాశి
రాబోయే నెల రోజులపాటు సూర్యుడు ఈరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తాడు. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే వారి కోరిక నెరవేరుతోంది. హోటల్ మరియు రెస్టారెంట్లకు సంబంధించిన వ్యాపారంలో ఉన్నవారు భారీగా లాభపడతారు. మీ కష్టానికితగిన ప్రతిఫలం లభిస్తుంది. 


Also Read: Makar Sankranti 2024: సంక్రాంతి ఈ 4 రాశులకు అస్సలు కలిసి రాదు.. ఇక వీరికి అన్నీ సమస్యలే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook