Makar Sankranti 2024 effect on Zodiac Signs: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి. ఈ ఫెస్టివల్ ను తెలుగు లోగిళ్లలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలో భాగంగా.. తొలి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమను చేసుకుంటారు. ఈ సంవత్సరం జనవరి 15న సూర్యభగవానుడు ధనస్సు రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మకర సంక్రాంతి అంటారు. పల్లెటూళ్లలో ఈ పండుగ వాతావరణం బాగా కనిపిస్తుంది. ప్రతి ఇంటి ముందు ముగ్గులు, హరదాసు కీర్తనలు, కోడి పందాలు, తీర్థ మహోత్సవాలు, పిండి వంటలతో ఎక్కడ చూసిన కోలాహలంగా ఉంటుంది. జ్యోతిష్యశాస్త్ర పరంగా కూడా ఈ పండుగ చాలా ముఖ్యమైనది. అయితే ఈ ఫెస్టివల్ కొన్ని రాశులవారికి కలిసి రాదు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మకరం: ఇదే రాశిలో సూర్యుడి సంచారం జరగబోతుంది. దీని కారణంగా సంక్రాంతి నుండి ఈరాశి వారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. విద్యార్థుల్లో ఏకాగ్రత లోపిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి పరిహరంగా నల్ల నువ్వులు, దుప్పటి, ఇనుము, నల్ల మినపప్పు దానం చేయడం మంచిది.
మిథునం: సూర్యుడి మకరరాశి ప్రవేశం మిథునరాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఆఫీసులో సహద్యోగులతో గొడవలయ్యే అవకాశం ఉంది. ఆకుపచ్చని వస్త్రాల దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.
సింహం: మకర సంక్రాంతి నాడు సింహరాశి గల వ్యక్తులకు వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ వైవాహిక జీవితంలో విభేదాలు వస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా ఈ సమయం అంతగా కలిసిరాకపోవచ్చు. దీని కోసం ఈరాశి వారు కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. బెల్లం, గోధుమలు, ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి పువ్వులు దానం చేయడం వల్ల శుభకరమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది.
Also Read: Shukra Gochar in January 2024: జనవరి 18న తొలి శుక్ర గోచారం.. ఈ 3 రాశుల వారిపై డబ్బు వర్షం..
వృశ్చికం: మకర సంక్రాంతి కారణంగా వృశ్చిక రాశి వారు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎటువంటి ఆస్తులు కొనుగోలు చేయకపోవడం మంచిది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో గొడవలయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఎరుపు రంగు పూలు, ఎరుపు వస్త్రాలు, పప్పులు, ఎర్ర పప్పు గింజలను దానం చేయడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter