Surya Ki Mahadasha Ke Upay: జ్యోతిషశాస్త్రంలో గ్రహ సంచారాలు, గ్రహాల కలయికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా ఇదే క్రమంలో గ్రహాల మహాదశ కూడా ప్రారంభమవుతాయి. అయితే కొన్ని గ్రహాల కలయికల వల్ల సూర్యుని మహాదశ ప్రారంభమైంది. ఇది 6 సంవత్సరాల పాటు కొనసాగే అవకాశాలున్నాయి. సూర్య గ్రహానికి జోతిష్య శాస్త్రంలో  విజయం, విశ్వాసం, కీర్తి, ఆరోగ్యం, గౌరవానికి సూచికగా భావిస్తారు. జాతకంలో సూర్యుడు శుభప్రదంగా ఉంటే..6 సంవత్సరాల మహాదశ అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి వ్యక్తులు  కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా పేరు, కీర్తిని కూడా పొందుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యుని మహాదశ ప్రభావాలు:
జాతకంలో సూర్యుని స్థానం బాగుంటే మహాదశలో ఉన్న వ్యక్తులకు పేరు, ధన, కీర్తి లభిస్తాయి. ఏ రంగంలో ఉన్నా పెద్ద పదవి, డబ్బు, పలుకుబడి, ఎనలేని కీర్తిని పొందుతాడని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వ్యక్తుల భారీగా లాభాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం, రాజకీయాలు లేదా పరిపాలనలో ఉన్న వ్యక్తులు విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


సూర్య గ్రహం జాతకంలో అశుభ స్థానంలో ఉండటం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలకు గురయ్యే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో కోపం వల్ల తీవ్ర నష్టాలను పొందే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల అధిక రక్తపోటు, కంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.


ఈ నివారణలు తప్పని సరి:
రాగి పాత్రలో నీటిని తీసుకొని ప్రతిరోజూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది.
'ఓం రామ్ రవయే నమః', 'ఓం ఘృణి సూర్యాయ నమః' అనే మంత్రాలను కూడా జపించాల్సి ఉంటుంది.
ఆదివారం గోధుమలు, బెల్లం లేదా రాగిని దానం చేయడం వల్ల జాతకంలో సూర్యుడు బలపడుతాడు.
రోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.


Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..


Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook