Trigrahi yogam effect: రీసెంట్ గా గ్రహాల రాజు సూర్యుడు తులరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే అదే రాశిలో కుజుడు, కేతువు సంచరిస్తున్నారు. తులరాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. ఆస్ట్రాలజీలో ఈ మూడు గ్రహాలు అత్యంత క్రూరమైన గ్రహాలుగా భావిస్తారు. దీని వల్ల అశుభకరమైన యోగం ఏర్పడుతోంది. ఈ సమయంలో ముఖ్యంగా ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్యా రాశి
ఈ అశుభ యోగం వల్ల మీరు ఆఫీసులో సహచరులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యంపై కేర్ తీసుకోండి. మెుత్తానికి ఈ సమయం మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. 


వృశ్చికం
ఈ సమయంలో మీరు మీ మాటలను అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే మీరు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. కోర్టు కేసుల్లో ఓడిపోయే అవకాశం ఉంది. పిల్లల ప్రవర్తన కారణంగా మీ కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. 
మకరం
త్రిగ్రాహి యోగం మకర రాశి వారికి కలిసి రాదు. మీరు మంచి డైట్ ఫాలోవ్వండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం. మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి. 


మేష రాశి 
త్రిగ్రాహి యోగ సమయంలో మేష రాశికి చెందిన ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎటువంటి వివాదాల్లోకి తలదూర్చకండి. మీకు కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి. దీని కారణంగా మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టవద్దు. ఈ టైంలో డబ్బు లావాదేవీలు చేయకండి, లేకుంటే మీకే నష్టం. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉండు. 
వృషభం
గ్రహాల రాశి కలయిక వల్ల మీరు చట్టపరమైన విషయాలలో చిక్కుకోవచ్చు. ఈ సమయంలో ఎలాంటి వివాదాలు జోలికి పోవద్దు. మీ లైఫ్ పార్టనర్ తో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా నష్టపోతారు. మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు. 


Also Read: Rahu Gochar 2023: దసరా తర్వాత ఈ మూడు రాశులకు తిరుగుండదు.. మీది ఉందా?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook