Rahu Gochar 2023: దసరా తర్వాత ఈ మూడు రాశులకు తిరుగుండదు.. మీది ఉందా?

Rahu Rashi Parivartan 2023: కాలానుగుణంగా గ్రహాలు రాశులను మారుస్తాయి. అక్టోబరు చివరిలో రాహువు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది మూడు రాశులవారికి లాభాలను ఇస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2023, 01:25 PM IST
Rahu Gochar 2023: దసరా తర్వాత ఈ మూడు రాశులకు తిరుగుండదు.. మీది ఉందా?

Rahu transit in Pisces 2023: గ్రహాల రాశి మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని  చూపుతుంది. ఈ నెల చివరిలో రాహువు తన గమనాన్ని మార్చబోతున్నాడు. అక్టోబరు 30వ తేదీ సాయంత్రం 05:44 గంటలకు రాహువు మీన రాశి ప్రవేశం చేయనున్నాడు. రాహువు యెుక్క ఈ రాశి మార్పు ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 

వృషభం
వృషభ రాశి వారికి రాహువు సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది.
మేషరాశి
రాహు సంచారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ డబ్బు బాగా వృథా అవుతుంది. మీరు పని లేదా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. 
మిధునరాశి
మీనరాశిలో రాహువు ప్రవేశం మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కష్టపడి పనిచేస్తే మీకు లాభం ఉంటుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు కష్టాల నుండి విముక్తి పొందుతారు. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారం విస్తరిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.

Also Read: Dussehra 2023: దసరా ఎప్పుడు? రావణ దహనం ఏ సమయంలో చేయాలి? 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News