Surya Mangal Gochar: సూర్య, కుజ గ్రహాలు సంచారాలతో ఈ రాశులవారికి నవంబర్ 17 నుంచి 99 శాతం ఇదే జరబోతోంది!
Surya Mangal Gochar: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సూర్య, కుజ గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి నష్టాలతో పాటు లాభాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని రాశులవారికి తీవ్ర సమస్యలు రావచ్చు.
Surya Mangal Gochar: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల చేసే రాశి సంచారాల మార్పు చాలా ముఖ్యమైనది. గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశులవారిపై శుభ, అశుభ ప్రభావాలు పడతాయి. కాబట్టి జాతకంలో గ్రహాల సంచారం అనుకూలంగా లేనివారు ఇలాంటి సమయాల్లో తప్పకుండా పలు రకాల జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. అయితే అతి త్వరలోనే సూర్య, కుజ గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. నవంబర్ 16న కుజుడు, నవంబర్ 17న సూర్యుడు వృశ్చికరాశిలోకి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి దుష్ప్రభావాలు కలిగితే, మరికొన్ని రాశులవారికి అదృష్టం రెట్టింపు అవుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేష రాశి:
ఈ సమయంలో మేష రాశివారికి మనస్సు కలత చెందుతుంది. కాబట్టి ఓపిక నహించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అధిక కోపం కారణంగా అనేక సమస్యలు రావచ్చు. ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు వీరికి ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. అయితే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ లభిస్తుంది.
వృషభ రాశి:
సూర్య, కుజ గ్రహాలు రాశి సంచారం చేయడం వల్ల వృషభ రాశివారికి కూడా ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మానసిక సమస్యలు రావచ్చు. దీంతో పాటు స్వీయ నియంత్రణ కూడా లోపించే ఛాన్స్‌లు ఉన్నాయి. అధిక కోపం కారణంగా ఇష్టమైన వాటిని వదులుకోవాల్సి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారు పనుల మీద విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా స్నేహితుల నుంచి సపోర్ట్ లభిస్తుంది.
మిథున రాశి:
ఈ సమయంలో మిథున రాశివారికి మనస్సు ఆనందంగా ఉంటుంది. వీరికి పూర్తిగా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. దీని కారణంగా ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. మీరు మీ పిల్లల నుండి శుభవార్త వింటారు. అంతేకాకుండా అధికారుల మద్ధతు లభించి ఊహించని లాభాలు పొందుతారు. అయితే ఈ సమయంలో ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది.
కర్కాటక రాశి:
ఈ రెండు గ్రహాల సంచారం కారణంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి అధికారుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. దీని కారణంగా ఆఫీస్‌లో ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగాలు మారే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
సింహ రాశి:
ఈ రాశివారికి కూడా రెండు గ్రహాల సంచారం కారణంగా మానసిక సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి అతిగా ఆలోచించడం మానుకోవాల్సి ఉంటుంది. కళ లేదా సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
కన్యా రాశి:
కన్యా రాశివారికి కూడా మనస్సు కలత చెందుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల చిన్న చిన్న సమస్యల బారిన పడతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టబడులు పెట్టేవారు జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఆర్థికంగా నష్టపోతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook