Sun Transit in Aries on 14th April 2023: వేద జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజుగా భావిస్తారు. ఏప్రిల్ 14, మధ్యాహ్నం  14:42 గంటలకు ఆదిత్యుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. భానుడు మే 15 వరకు అదే రాశిలో  ఉంటాడు. మేషరాశికి అధిపతి అంగారకుడి. కుజుడు యెుక్క రాశి అయిన మేషరాశిలో సూర్యుడు పవర్ పుల్ గా ఉంటాడు. మేషరాశిలో సూర్యుని సంచారం నాలుగు రాశులవారు లాభదాయకంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యుడి సంచారం ఈ రాశులకు వరం


ధనుస్సు రాశి
మీ రాశి యెుక్క తొమ్మిదవ ఇంటికి భానుడు అధిపతి.  ఈ సంచార సమయంలో సూర్యుడు ఐదవ ఇంట్లో ఉంటాడు. సూర్యుడి గోచారం వల్ల మీకు కొత్త జాబ్ వస్తుంది. మీ కెరీర్ మునుపటి కంటే సూపర్ గా ఉంటుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం  పొందుతారు. మీ ధనం రెట్టింపు అవుతుంది. 


కుంభ రాశి
కుంభ రాశి యెుక్క ఏడో ఇంటికి ఆదిత్యుడు అధిపతి. ఈ సంచార సమయంలో మీ రాశి యెుక్క మూడవ ఇంట్లో సూర్యుడు సంచరిస్తాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా మీరు ప్రయోజనం పొందుతారు. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. విదేశాల నుంచి ఎక్కువగా డబ్బు వచ్చే అవకాశం ఉంది.


Also Read: Chaturgrahi Yogam: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో నాలుగు గ్రహాల మహా కలయిక.. ఈ 5 రాశులకు తిరుగులేదు ఇక..


మేషరాశి
ఈ రాశి యెుక్క ఐదో ఇంటికి సూర్యభగవానుడు అధిపతి. ఈ ఇల్లు ఆధ్యాత్మికత మరియు సంతానానికి కారకుడిగా భావిస్తారు. దీంతో మీరు కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీరు అధిక ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఆర్థికంగా మీరు లాభపడతారు. మీకుకొత్త జాబ్ లభించే అవకాశం ఉంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది.


సింహరాశి
సింహరాశి యెుక్క మెుదటి ఇంటిగా అధిపతిగా ఆదిత్యుడిని భావిస్తారు. అంతేకాకుండా మీ జాతకంలోని తొమ్మిదో ఇంట్లో సూర్యుడు సంచరించనున్నాడు. మేషరాశిలో సూర్యుని గోచారం వల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీకు ధనప్రవాహం పెరుగుతుంది. మీరు వృత్తిలో పురోగకి సాధిస్తారు. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మీకు కొత్త ఉద్యోగాలు వస్తాయి. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. 


Also Read: Mesh Sankranti 2023: మేష సంక్రాంతి నాడు ఇలా చేస్తే.. సూర్యుడు మీపై డబ్బు వర్షం కురిపించడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి