Get Surya Dev Grace on Mesh Sankranti 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈనెల 14, శుక్రవారం నాడు సూర్యదేవుడు మీనరాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మేష సంక్రాంతి అంటారు. సూర్యభగవానుడు ప్రతి నెలా తన రాశిని ఛేంజ్ చేస్తాడు. సంవత్సరం మెుత్తం మీద ఆదిత్యుడు 12 సార్లు రాశిని మారుస్తాడు. భానుడు ఒక రాశిని వదిలి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అని పిలుస్తారు.
సూర్యభగవానుడు ఫ్లానెట్స్ కింగ్ అని పిలుస్తారు. ఎవరి జాతకంలో భానుడు శుభస్థానంలో ఉంటాడో వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. గౌరవం, కీర్తి మరియు విజయానికి కారకుడిగా సూర్యుడిని భావిస్తారు. మేష సంక్రాంతి రోజున సూర్యభగవానుని ఆరాధించడం, స్నానం చేయడం మరియు దానం చేయడం వల్ల మీరు విశేష ప్రయోజనాలు పొందుతారు. జీవితంలో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మేష సంక్రాంతి రోజున ఏ విధమైన చర్యలు చేయడం వల్ల సూర్యభగవానుడు అనుగ్రహిస్తాడో తెలుసుకుందాం.
Also Read: Jupiter Rise 2023: గురు గ్రహం మేషరాశిలో ఉదయం, 5 రాశులకు ఉన్నత పదవులు, అంతులేని డబ్బు
ఈ పరిహారంతో సూర్యుడిని ప్రసన్నం చేసుకోండి
** మేష సంక్రాంతి నాడు సూర్యభగవానుడికి నీటితో ఆర్ఘ్యం సమర్పించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
** ఈ సంక్రాంతి రోజున స్నానం మరియు దానం చేయడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు.
** మేష సంక్రాంతి రోజున సత్తుల దానం చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది.
** మేష సంక్రాంతి రోజున బెల్లం డొనేట్ చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల శారీరక బాధ పోవడంతోపాటు మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు.
** మేష సంక్రాంతి రోజున ఫ్యాన్ దానం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
** మేష సంక్రాంతి రోజున పప్పును దానం చేయడం వల్ల మీరు కెరీర్ లో పురోగతిని సాధిస్తారు.
Also Read: Saturn Transit 2023: మరో 48 గంటల్లో ఈ 3 రాశులవారు ధనవంతులు కానున్నారు.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి