Sun transit 2023: మే 15 నుండి ఈరాశుల అదృష్టం సూర్యుడిలా ప్రకాశించనుంది.. మీ రాశి ఉందా?
Surya Gochar 2023: సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. మే 15న వృషభ సంక్రాంతి ఏర్పడనుంది. ఆదిత్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Surya Rashi Parivartan 2023 May: ప్రతి నెలా సూర్యభగవానుడు తన రాశిని మారుస్తాడు. ఈనెలలో కూడా ఆదిత్యుడు తన రాశిని ఛేంజ్ చేయనున్నాడు. మే 15న, ఉదయం 11.32 గంటలకు భానుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే వృషభ సంక్రాంతి అంటారు. సూర్యుడి రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
వృషభం- ఇదే రాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. దీంతో మీరు చాలా ప్రయోజనాలు పొందుతారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ధనలాభం ఉంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. మీరు పాత మిత్రులను కలుసుకుంటారు.
సింహ రాశి- సింహ రాశికి సూర్యుడు అధిపతి. ఈ రాశి వారిపై ఆదిత్యుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ మరియు వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. మీ సంపద పెరుగుతుంది. మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు.
కన్యారాశి- సూర్య సంచారం కన్యారాశి వారికి పురోభివృద్ధిని ఇస్తుంది. నిరుద్యోగులకు నచ్చిన జాబ్ వస్తుంది. మీరు కెరీర్ లో కొత్త అవకాశాలను అందుకుంటారు. మీరు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంది. సమాజంలో గౌరం పెరుగుతుంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది.
మకర రాశి- సూర్యుని సంచారం మకర రాశి వారికి ఆర్థికంగా లాభాన్ని ఇస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్యాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు.
Also Read: Guru Uday 2023: హన్స్ రాజయోగంతో ఈ 3 రాశులపై నోట్ల వర్షం.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook