హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఈ జ్యోతిష్యం ప్రకారం రాశుల గోచారం ప్రభావం వివిధ రాశులపై వివిధ రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న సూర్య, శని గ్రహాల స్థితి మరో 25 రోజులు ఉండనుంది. అయితే ఆ ప్రభావం ఆ మూడు రాశులపై ఎలా ఉంటుందనేది పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిగ్రహం ఇప్పటికే కుంభరాశిలో విరాజిల్లుతున్నాడు. అదే కుంభరాశిలో వారం రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 13న సూర్యుడి గోచారమైంది. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో ఉండటం వల్ల చాలా రాశులకు హానికారకంగా ఉంటోంది. ఎందుకంటే ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో ఏదో ఒక రాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశులపై అనుకూలంగా, కొన్ని రాశులపై ప్రతికూలంగా ప్రభావం పడుతుంటుంది. అదే విధంగా ఫిబ్రవరి 13న సూర్యుడి కుంభరాశి ప్రవేశం, అప్పటికే శని అందులో ఉండటంతో..ఈ రెండు శక్తివంతమైన గ్రహాల ప్రభావం కొన్ని రాశుల జీవితాలపై దుష్ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా కుంభం, మకరం, కర్కాటక రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..


కుంభ రాశి


జ్యోతిష్యం ప్రకారం సూర్య, శని గ్రహాల యుతి కారణంగా కుంభరాశివారికి కష్టాలు ప్రారంభమయ్యాయి. శని సూర్య గ్రహాల యుతి కుంభరాశిలో ఉండనుంది. ఈ క్రమంలో ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో నోరు, గొంతు సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అంతేకాకుండా శరీరంలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ రావచ్చు. ఈ సమయంలో మీరు అనుకున్న పనులకు ఆటంకం కలుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పాడవవచ్చు. అంతేకాకుండా జీవిత భాగస్వామితో కొన్ని అంశాల్లో వివాదం రావచ్చు. ముఖ్యంగా ఈ స్థితి మార్చ్ 15 అంటే మర్ 25 రోజులు కొనసాగనుంది. 


మకర రాశి


జ్యోతిష్యం ప్రకారం మకర రాశివారికి ఈ సమయం అత్యంత ప్రతికూలం కానుంది. శని గ్రహం మీ గోచార కుండలిలో లగ్నపాదానికి అధిపతి. అందుకే ఈ సందర్భంగా ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. దగ్గు, జ్వరం వంటి సమస్యలు రావచ్చు. దాంతోపాటు మకర రాశి వారికి ఈ సమయం శని సాడే సతి నడుస్తున్నందున..వ్యాపారం మందగిస్తుంది. ఏదైనా డీల్ ఖరారయ్యే దశలో నిలిచిపోతుంది. 


కర్కాటక రాశి


రెండు గ్రహాల యుతి కర్కాటక రాశివారికి హానికారకంగా ఉంటుంది. ఈ యుతి మీ రాశి అష్టమపాదంలో ఉండనుంది. ఈ క్రమంలో ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై ధ్యాస అవసరం. లేకపోతే సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. మార్చ్ 15 వరకూ అంటే మరో 25 రోజులు ఈ రాశివారికి ఇబ్బందులు తప్పవు. 


Also read: Mercury transit 2023: ఫిబ్రవరి 27న బుధాదిత్య రాజయోగం.. ఈరాశులకు జాక్ పాట్ ఖాయం..



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook