Hindu Nav Varsh 2023: హిందూ నూతన సంవత్సర శుభ యాదృచ్చికం.. ఈ మూడు రాశుల వారికి ఏడాది పొడవునా డబ్బే!
Gemini, Sagittarius and Libra Zodiac Sign peoples will get money Throughout the Year after Vikram Samvat 2023. ఈసారి హిందూ నూతన సంవత్సరం బుధవారం నాడు వృశ్చిక రాశిలో ప్రారంభమవుతుంది.
These 3 Zodiac Signs Will Get Huge Money Throughout the Year due to Hindu Nav Varsh 2023: హిందూ క్యాలెండర్ విక్రమ్ సంవత్ 2028 చైత్ర మాసం నుంచి ప్రారంభమవుతుంది. దీనిని 'హిందూ నూతన సంవత్సరం 2023' అని కూడా అంటారు. పంచాంగం ప్రకారం.. ప్రతి సంవత్సరం హిందూ నూతన సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్షం ప్రతిపాద తేదీలో ప్రారంభమవుతుంది. చైత్ర మాస నవ రాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఈసారి హిందూ నూతన సంవత్సరం బుధవారం నాడు వృశ్చిక రాశిలో ప్రారంభమవుతుంది.
30 ఏళ్ల తర్వాత ఈ కొత్త సంవత్సరం అరుదైన యోగంతో ప్రారంభమవుతోంది. శని దేవుడు 30 సంవత్సరాల తర్వాత కుంభ రాశిలో సంచరించాడు. 12 సంవత్సరాల తర్వాత మేష రాశిలోకి బృహస్పతి సంచరిస్తాడు. దాంతో ఈసారి కొత్త సంవత్సరం చాలా కీలకంగా మారింది. ఈ నూతన సంవత్సరం కొన్ని రాశుల వారికి ఎంతో ప్రయోజనంగా ఉండనుంది. ఆ రాశులు ఏవో ఓసారి చూద్దాం.
మిధున రాశి:
మిథున రాశి వారికి హిందూ నూతన సంవత్సరంలో శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ సంవత్సరం మిధున రాశి వారికి బృహస్పతి ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. పాత పెట్టుబడి నుంచి లాభాలు వస్తాయి. దాంతో ఆదాయం భారీగా పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ సంవత్సరంలో విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.
ధనుస్సు రాశి:
హిందూ నూతన సంవత్సరం ధనుస్సు రాశి వారికి శుభ రోజులను ఇస్తాయి. ఏప్రిల్ 22 నుంచి బృహస్పతి.. ధనుస్సు రాశి ఐదవ ఇంటిలో సంచరిస్తాడు. దాంతో ఏడాది పొడవునా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి కొనుగోలు కల ఈ సంవత్సరంలో నెరవేరుతుంది.
తులా రాశి:
హిందూ నూతన సంవత్సరం తులా రాశి వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. దేవగురువు బృహస్పతి యొక్క శుభ అంశం కూడా ఈ రాశి పైనే ఉంటుంది. ఏదో ఒక కారణంతో పెళ్లి ఆగిపోయిన వారికి ఈ ఏడాది పెళ్లి జరగనుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు గడిస్తారు. కోర్టు కేసులలో విజయం ఉంటుంది. ఏడాది పొడవునా డబ్బు రాక ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.