Best Jio Recharge Plan 2023: జియో సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌.. 388 రోజుల వాలిడిటీ! డేటాను అస్సలు పూర్తిచేయలేరు

Reliance Jio Best and Cheap Recharge Plan is Rs 2999. రిలయన్స్‌ జియో సరికొత్త చౌకైన ప్లాన్ ధర రూ. 2999 రీఛార్జ్. ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రతి నెలా రీఛార్జ్ చేసుకునే వారికి ఈ ఆఫర్ చాలా బాగుంటుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 14, 2023, 04:10 PM IST
  • జియో సరికొత్త ప్లాన్
  • 388 రోజుల వాలిడిటీ
  • డేటాను అస్సలు పూర్తిచేయలేరు
Best Jio Recharge Plan 2023: జియో సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌.. 388 రోజుల వాలిడిటీ! డేటాను అస్సలు పూర్తిచేయలేరు

Jio Introduces Rs 2999 Plan With 388 days Validity: భారత దేశంలోని టెలికాం నెట్‌వర్క్‌లు తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికపుడు ఎన్నో ఆఫర్లను తీసుకువస్తున్నాయి. కొన్ని నెట్‌వర్క్‌లు తక్కువ రీఛార్జ్‌తో ఎక్కువ బెనిఫిట్స్‌ ఉండేలా ప్లాన్స్‌ తెస్తున్నాయి. ఈ విషయంలో ప్రముఖ టెలికాం దిగ్గజం 'రిలయన్స్‌ జియో' ముందువరుసలో ఉంది. ఇటీవలి కాలంలో జియో తన వినియోగదారుల కోసం చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే మరో సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రతి నెలా రీఛార్జ్ చేసుకునే వారికి ఈ ఆఫర్ చాలా బాగుంటుంది. 

సరికొత్త జియో ప్లాన్ మరేదో కాదు.. రూ. 2999. ఈ ప్లాన్‌లో మీకు దీర్ఘకాలం చెల్లుబాటు లభిస్తుంది. దీని కారణంగా మీరు ప్రతి నెల రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 912 GB డేటాను మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు హై స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందుతారు. ఇది వీడియో డౌన్‌లోడ్, వీడియో స్ట్రీమింగ్‌లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

రూ. 2999 రీఛార్జ్‌ ప్లాన్‌లో రోజువారీగా లెక్కేస్తే.. డైలీ 2.5 GB డేటాను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు వినియోగదారులు 100 sms పొందుతారు. ఇక ప్రతిరోజూ అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో మీకు 365 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. ఈ వ్యాలిడిటీని పొడగించడానికి జియో కంపెనీ.. ఈ ప్లాన్‌తో 23 రోజుల అదనపు వాలిడిటీని కూడా అందిస్తోంది. దాంతో ఈ ప్లాన్ మొత్తం వాలిడిటీ 388 రోజులు అవుతుంది. కాంప్లిమెంటరీగా 87 GB డేటాను కూడా ఈ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్రయోజనాలను చూస్తే.. ఈ ప్లాన్ ఏ కస్టమర్‌కైనా ఉత్తమ ఎంపికగా ఉంటుంది.

Also Read: Gold Price Hike: దీపావళి నాటికి భారీగా పెరగనున్న బంగారం ధర.. ఇక కొనలేమేమో! ఇప్పుడే కొంటే బెటర్  

Also Read: Adani Group Shares: కొనసాగుతున్న అదానీ గ్రూప్ షేర్ల పతనం, కంపెనీ షేర్లు 5 శాతం డౌన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News