These 4 zodiac signs will face heavy problems due to Rahu Transit 2023: జ్యోతిషశాస్త్రంలో శని, రాహు మరియు కేతువుల సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే.. ఈ మూడు గ్రహాల సంచారాలు అన్ని రాశుల ప్రజల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతాయి. శని, రాహు-కేతు సంచార ప్రభావం అస్సలు శ్రేయస్కరం కాదు. ఈ సంత్సరాలు ప్రజల జీవితాలను ఇబ్బందులకు గురిచేస్తుంది. రాహువు 2023లో సంచరించబోతున్నాడు. జ్యోతిషశాస్త్రం మరియు పంచాంగం ప్రకారం.. 2023 అక్టోబర్ 30 మధ్యాహ్నం 1.33 గంటలకు మీన రాశిలోకి రాహువు ప్రవేశిస్తాడు. మీన రాశిలోకి రాహువు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులపై శుభ ప్రభావం, మరికొన్నింటిపై అశుభ ప్రభావం ఉంటుంది. రాహువు ఎవరిని ధనవంతులను చేస్తాడో, ఎవరికి ఇబ్బంది కలిగిస్తాడో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహు సంచారం ప్రతిసారి కొంత మందికి అశుభ ఫలితాలను ఇస్తుంది. 2023 అక్టోబర్‌లో రాబోతున్న రాహు సంచారం ముఖ్యంగా నాలుగు రాశులకు అశుభంగా ఉండనుంది. మేషం, వృషభం, కన్య మరియు మకర రాశుల వారికి 2023 రాహు సంచారం అస్సలు మంచిది కాదు. ఈ 4 రాశుల వ్యక్తులు ఒత్తిడిని ఎదుర్కోక తప్పదు. భారీగా డబ్బు నష్టం ఉంటుంది. పెట్టుబడితో బరిగా నష్టపోవచ్చు. ఇది కాకుండా శారీరక మరియు మానసిక సమస్యలు ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. అడుగడుగునా కష్టాలే ఉంటాయి.


మరోవైపు మీన రాశిలో రాహువు ప్రవేశం మాత్రం ఈ 4 రాశుల వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. మిథునం, కర్కాటకం, కుంభం మరియు మీన రాశుల వారికి రాహువు సంచారం భారీగా కలిసిరానుంది. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభాలు ఉంటాయి.


మిథునం: 
రాహువు రాశి మార్పు వల్ల మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. చాలా కాలంగా ఉన్న టెన్షన్ తొలగిపోతుంది.


కర్కాటకం: 
రాహు సంచార ప్రభావం వల్ల కర్కాటక రాశి వారి వ్యాపారం పెరుగుతుంది. ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఇది మంచి సమయం.


కుంభం: 
రాహువు సంచారం వల్ల కుంభ రాశి వారికి ధన లాభం కలుగుతుంది. పదవి, కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. పాత పెట్టుబడి లాభిస్తుంది. 


మీనం: 
రాహువు తన రాశిని మార్చుకుని మీన రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి.. ఈ రాశి వ్యక్తులు ధనలాభాలను పొందుతారు. పెట్టుబడికి ఇది మంచి సమయం. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కెరీర్‌లో విజయం ఉంటుంది.


Also Read: Cheapest Smart TV: 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ధరలోనే.. 55 ఇంచ్ స్మార్ట్ టీవీ వచ్చేస్తుంది! ఎగబడుతున్న జనం  


Also Read: Best Cruisers Bikes: 2 లక్షల లోపు బెస్ట్ క్రూయిజర్ బైక్స్.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లినా అలసట ఉండదు!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.