Zodiac Sign and Attitude: జ్యోతిష్యశాస్త్రంలో రాశుల గుణగణాలు, స్వభావం గురించి విపులంగా ఉంది. కొన్ని రాశుల జాతకాల ప్రకారం భాగస్వామిపై ఏ మాత్రం విశ్వాసముంచరు సరికదా..ప్రతి చిన్నదానికీ అనుమానిస్తుంటారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశుల ప్రకారం మనుష్యుల గుణగణాలు స్వభావాల్ని అంచనా వేయవచ్చట. అవతలి వ్యక్తి రాశిని బట్టి..అతని స్వభావం, గుణం ఎలాంటిదో తెలుసుకోవచ్చు. అంతేకాదు ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారో కూడా చెప్పవచ్చంట. జ్యోతిష్యంలో కొన్ని రాశుల వారైతే ఎల్లప్పుడూ పూర్తిగా అపనమ్మకంతోనే ఉంటారు. భాగస్వామిపై కాస్తైనా విశ్వాసముంచరు. ప్రతి చిన్న విషయానికీ అనుమానిస్తుంటారు. ఆ రాశులేంటంటే..


మేషరాశి ( Aries)


ఈ రాశిలో పుట్టినవారు ఎక్కువగా శంకించేవారై ఉంటారు. ప్రత్యేకించి ఈ రాశి స్త్రీలు తమ భాగస్వామి లేదా భర్తపై అస్సలు విశ్వాసముంచరు. నిజానికి శంకించడమనేది వీరి స్వభావంలో ఓ భాగం. ఈ రాశివారు భావోద్వేగులై ఉంటారు. ఏ మాత్రం సందేహం వచ్చినా తమ భాగస్వామి కదలికలపై కన్నేసి నిఘా ప్రారంభించేస్తారు. 


వృషభరాశి (  Taurus)


ఈ రాశిలో పుట్టినవారిని కళ్లు మూసుకుని నమ్మవచ్చు. కానీ ఈ రాశివారు మాత్రం ఇతరులపై అస్సలు విశ్వాసముంచరు. ఈ రాశిలోవారికి అనుమానం ప్రధాన లక్షణం. తమ భాగస్వామి కదలికలపై ఎల్లప్పుడూ దృష్టి సారించే ఉంటారు. అనుమానం కారణంగా భాగస్వామి ఫోన్ లేదా మెయిల్‌ను తరచూ పరిశీలిస్తుంటారు. 


ధనస్సు రాశి ( Sagittarius)


ఈ రాశిలో పుట్టినవారు బంధాల్లో ప్రత్యేకంగా ఉంటారు. భాగస్వామికి స్పేస్ ఇవ్వడం అస్సలిష్టం ఉండదు. ప్రత్యేకించి ఈ రాశిలోని అమ్మాయిలు తమ భాగస్వామి ప్రతి కదలికను శోదిస్తుంటారు. 


Also read: Horoscope 2022 February 25: ఈ రాశుల వారికి ప్రేమ వ్యవహారంలో నేడు అంతా మంచే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి