Horoscope 2022 February 25: ఈ రాశుల వారికి ప్రేమ వ్యవహారంలో నేడు అంతా మంచే..

Horoscope 2022 February  25: నేడు 2022 ఫిబ్రవరి 25 (శుక్రవారం). వివిధ రాశులవాకి ఎలా ఉండనుంది. గ్రహఫలాలు, రాశి ఫలాలు మీకోసం. దీనితో పాటు ప్రేమ వ్యవహారంలో ఏ రాశి వారికి ఎలా ఉండనుందో తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2022, 06:38 AM IST
  • శుక్రవారం ఏఏ రాశి వారికి ఎలా ఉండనుంది?
  • కుటుంబ సమస్యలు ఉండే రాశులు ఏవి?
  • ప్రేమ వ్యవహారాల్లో ఏ రాశుల వారికి అనుకూలం?
Horoscope 2022 February  25: ఈ రాశుల వారికి ప్రేమ వ్యవహారంలో నేడు అంతా మంచే..

Horoscope 2022 February  25: రాశీ ఫలాలకు మన సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. మరి ఈ రోజుకు సంబధించి వివిధ రాశుల వారికి ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం
సూర్యోదయం- ఉదయం 6.50 గంటలు
సూర్యాస్తమయం- సాయంత్రం 6.18 గంటలు
తిథి- నవమి తదుపరి దశమి
రాహుకాలం: ఉదయం 11.08 గంటల నుంచి మధ్యాహ్నం 12.34 గంటల వరకు
యమ గండం మధ్యాహ్నం 3.26 నుంచి 4.52 వరకు

రాశి ఫలాలు..

మేష రాశి
ఈ రాశి వారికి ధన యోగం ఉంది. శుక్రవారం పూట ధన యోగం ఉండటం శుభప్రదం. అంతే కాకుండా ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఓ సూచన ద్వారా మానసిక ప్రశాంతత మరింత పెరుగుతుంది. జీవిత భాగస్వామితోత ఆనందంగా గడుపుతారు.

వృషభ రాశి 

ఈ రాశి వారు నేడు కాస్త జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంది. సమీప బంధువలతో తగాదాలు వచ్చే ప్రమాదముంది. వ్యాపారులరకు ధన నష్టం వాటిళ్లొచ్చు. ఆరోగ్యం బాగుపడుతుంది. ఇంట్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు.

మిథున రాశి

ఈ రాశి వారికి నేడు ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు. ప్రేమ సంబంధి విషయాలకు పరిస్థితి అంతగా అనుకూలకంగా లేవు. మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకునేందుకు ధ్యానం చేయడం మేలు. పెండింగ్​ పనులను పూర్తయ్యే అవకాశముంది.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి నేడు వృత్తిపరంగా సానుకూలంగా ఉండొచ్చు. ఆర్థిక, ఆరోగ్య విషయంలో కూడా సానుకూలత ఉంది. అనుకోని ప్రయాణాలు చేయొచ్చు. జీవిత భాగస్వామితో గొడవలు సద్దుమణిగేందుకు ప్రయత్నాలు చేస్తారు.

సింహ రాశి

ఈ రాశి వారుకి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు. జాగ్రత్తగా ఉండకపోతే.. ఇబ్బందులు అధికమవ్వచ్చు. కుటుంబ కలహాలకు తావివ్వకండి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో తగాదాలు ఇబ్బంది పెట్టొచ్చు. వృత్తి జీవితం సాఫీగా సాగుతుంది.

కన్యా రాశి

ఈ రాశి వారికి నేడు అంతా మేలు జరుగుతుంది. కుటంబ విషయాలు, ఆరోగ్యం పరంగా జాగ్రత్త అవసరం. ప్రేమ సంబంధి విషయాలకు నేడు అనుకూలంగా ఉంది. మూలనబడిన పాత  సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తారు.

తుల రాశి

ఈ రాశి వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. రోజంతా యాక్టివ్​గా గడుపుతారు. ఆర్థిక విషయాల పరంగానూ అంతా సాఫీగా సాగుతుంది. కుటుంబంల అడపాదడపా సమస్యలు మినహా అంతా మంచే జరుగుతుంది. ప్రేమ సంబంధి విషయాల్లో ఈ రోజు ఏ పని చేసినా మీకు అనుకూలమే. వృత్తి జీవితంలో పై స్థాయి అధికారుల ప్రశంసలు పొందుతారు.

వృశ్చిక రాశి

ఈ రాశి పురుషులకు (పెళ్లైన వారికి) భార్య తల్లిదండ్రుల నుంచి ఆర్థికంగా ప్రయోజనాలు కలకగొచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. కుటుంబ సమస్యలు కూడా రావచ్చు. వృత్తి జీవితం సాఫీగా సాగుతుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం, సంపద మిశ్రమంగా ఉండనుంది. విలాసాలకు ఖర్చులు చేయడం వంటివి మంచిది కాదు. ప్రేమ సంబంధి విషయంలో నేడు అంతా మేలు జరుగుతుంది. ఉద్యోగ లేదా వ్యాపారం చేసే వారికి నేడు సాఫీగా సాగుతుంది.

మకర రాశి

ఈ రాశి వారికి వృత్తి పరంగా సానుకూలంగా ఉంది. కుటంబం విషయంలో మాత్రం జాగ్రత్త. పెళ్లైన వారు జీవిత భాగస్వామితో గొడవపడొచ్చు. వ్యాపారులు నేడు కొత్తగా ప్రాజెక్టులుచేపట్టడం, వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రూపొందిచడం వంటివి చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. సంపద ఉన్నా ఖర్చుల వల్ల అది కనిపించదు.

కుంభ రాశి

ఈ రాశి వారు నేడు సన్నిహితుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోడవం ద్వారా మంచి విజయాన్ని సాధిస్తారు. వ్యాపార పరంగానూ, ఇతర విషయాల్లోనూ. అయితే మీరు తరువాత ఏం చేయాలనుకుంటున్నారో అనే విషయాన్ని మాత్రం ఎవరికీ చెప్పొద్దు. తెలుపు రంగు దుస్తులు దరించడం మంచిది. ప్రేమ వ్యావహారాలకు అనుకూల సమయం నడుస్తోంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంపద పెరుగుతుంది.

మీన రాశి

ఈ రాశి వారికి నేడు మొత్తం సవ్యంగా జరుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పని చేసే ప్రదేశంలో మీ తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. మానసిక ఒత్తిడికి తావివ్వకండి. అవసరానికి డబ్బు చితికందుతుంది. కొంత కాకలంగా వేదిస్తున్న కుటుంబ సమస్యలు నేడు తొలగిపోయే అవకాశముంది.

Also read: Mahashivratri 2022: మహాశివరాత్రి నాడు ఈ పూజలు చేస్తే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి!

Also read: Vastu Tips: ఆ రోజు చీపురు కొంటే మీ ఇంట్లో కాసుల వర్షం కురుస్తుందట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News