Expensive zodiac signs: ఈ రోజుల్లో డబ్బు అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. డబ్బు సంపాదించడమే కాదు.. దానిని పొదుపు చేసుకోవడం కూడా తెలుసుకోవవాలి. కానీ కొంత మంది మాత్రం డబ్బును నీళ్లలా వృధాగా ఖర్చు చేస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఐదు రాశుల వారు ఇలా డబ్బును ఎక్కువగా ఖర్చు చేయడం, ధనం పట్ల పెద్దగా ఆసక్తి లేకపోడవం వంటి పనులు చేస్తుంటారని తెలిసింది. ఇంతకీ ఆ రాశుల ఏవి? ఆయా రాశుల వారు డబ్బును ఎలా ఖర్చు చేస్తుంటారు? అనే విషయంపై జ్యోతిష్య నిపుణులు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి.


వృషభ రాశి..


ఈ రాశి వారు విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఇష్టపడతారు. ఇందుకోసం ఎంత డబ్బయినా ఖర్చు చేసేందుకు వెనకాడరు. ఇంకా చెప్పలంటే.. చౌక వస్తువులంటే ఈ రాశి వారికి అస్సలు ఇష్టముండదు. తమకు నచ్చిన వస్తువులు ఎంత ఖరీదైనవైనా వాటినే కొనేందుకు ఇష్టపడతారు.


సింహ రాశి..


ఈ రాశికి చెందిన వారు కూడా డబ్బుకు విలువ ఇవ్వరు. ఖర్చు పెట్టే విషయంలో అందరికంటే ముందు ఈ రాశి వారు ముందు వరుసలో ఉంటారు. మరో విశేషమేమిటంటే.. తమకోసం తాము ఖర్చు చేసుకోవడంతో పాటు.. ఇతరులకోసం కూడా డబ్బులు ఖర్చు చేయడంలో ఈ రాశి వారు ముందుంటారు. సింహరాశివారు ఇతరులకు ఇచ్చే బహుమతులు కూడా ఖరీదైనవిగా ఉండేలా చూసుకుంటారు.


మకర రాశి..


వృషభ, సింహ రాశి వారితో పోల్చితే.. ఈ రాశివారు డబ్బు విషయంలో కొత్త భిన్నంగా ఉంటారు. ఎందుకంటే.. ఈ రాశి వారు డబ్బు సంపాదించేందుకు తీవ్రంగా శ్రమిస్తారు. కానీ ఖర్చు చేసే విషయంలో మాత్రం అస్సలు ఎలాంటి ఆలోచన చేయరు. మరో విశేషమేమిటంటే.. ఈ రాశి వారు తమకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు మాత్రం.. బేరాలు ఆడుతారు. ఖర్చు చేసే ప్రతి పైసాకు ఆనందాన్ని వెతుక్కుంటారు.


ధనుస్సు రాశి..


ధనుస్సు రాశి వారు డబ్బు ఖర్చు చేసే విషయంలో ఒక పరిమితి అంటూ విధించుకోరు, ముఖ్యంగా వీరు ఖరీదైన అభిరుచులను, అలవాట్లను కలిగి ఉంటారు. అందుకే ఇతర రాశులతో పోలిస్తే.. ఈ రాశివారు చాలా డిఫరెంట్​గా ఉంటారు.


కుంభ రాశి..


కుంభ రాశి వారు లగ్జరీ ఫోన్లు, ఖరీదైన వస్తువులను ఎక్కువగా ఇష్టపడతారు. ఖరీదైన గాడ్జెట్స్​ కొనుగోలు చేసేందుకు ఈ రాశివారు ఎక్కుగా ఖర్చులు చేస్తారు. అయితే దేనికోసం ఎంత ఖర్చు చేయాలి? అనే విషయంలో జాగ్రత్తగా ఉంటారు.


(నోట్​: ఈ కథనంలోని విషయాలు కేవలం జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. వీటని ZEE తెలుగు NEWS ధృవీకరించలేదు.)


Also read: Hindu Beliefs: సూర్యాస్తమయం తరువాత చేయకూడని పనులివే..లేకపోతే


Also read: Maha Shivratri 2022: మహాశివరాత్రి వచ్చేస్తోంది.. ఆ రోజున శివుని పూజా విధివిధానాలు తెలుసుకోండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook