Maha Shivratri 2022: మహాశివరాత్రి వచ్చేస్తోంది.. ఆ రోజున శివుని పూజా విధివిధానాలు తెలుసుకోండి!

Maha Shivratri 2022: పరమశివుని ఇష్టమైన రోజు సమీపిస్తుంది. ఫాల్గుణ మాసంలోని త్రయోదశి తిథి నాడు జరిగే మహాశివరాత్రి కోసం భక్తులందరూ ఎదురుచూస్తున్నారు. ఆ రోజున పరమేశ్వరుడికి వివిధ పూజలు చేసి ప్రసన్నం చేసుకునేందుకు ప్రజలను ఎదురుచూస్తున్నారు. మహశివరాత్రి నాడు శివుని పూజించే విధివిధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 05:05 PM IST
    • మార్చి 1న దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు
    • పూజలు, ఉపవాసాలు చేసేందుకు సిద్ధమవుతున్న భక్తులు
    • ఆ రోజున శివుని పూజా విధివిధాలేవో తెలుసుకోండి!
Maha Shivratri 2022: మహాశివరాత్రి వచ్చేస్తోంది.. ఆ రోజున శివుని పూజా విధివిధానాలు తెలుసుకోండి!

Maha Shivratri 2022: మహాశివరాత్రి పర్వదినానికి రోజులు సమీపిస్తున్నాయి. మార్చి 1న రానున్న మహాశివరాత్రి కోసం దేశంలోని ప్రముఖ శివాలయాలను భక్తుల రాక కోసం సిద్ధమవుతున్నాయి. ఆ రోజున పరమ శివుడు, పార్వతీ దేవీని వివాహం చేసుకున్నట్లు పురణాలు చెబుతున్నాయి. ఫాల్గుణ మాస త్రయోదశి నాడు ప్రజలు మహాశివరాత్రిని జరుపుకోనున్నారు. శివపార్వతుల వివాహం జరిగిన సందర్భంగా మహాశివరాత్రి నాడు శివపార్వతులిద్దరూ జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తారు. కాబట్టి ఇదే రోజున చాలా మంది శివ భక్తులు తమ ఇంట్లోని పూజా మందిరాల్లో రుద్రాక్షలను పూజిస్తారు. 

శాస్త్రాల ప్రకారం.. మహాశివరాత్రి నాడు రుద్రాక్ష పూజ చేయడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. దీంతో పాటు శివునికి ప్రీతిపాత్రమైన బిళ్వ పత్రాలతో పూజ చేస్తే ఆ పరమ శివుని అనుగ్రహం పొందవచ్చని కొందరు భక్తులు భావన. ఆర్థిక ఇబ్బందులు తొలగడం సహా అన్ని రంగాల్లో కలిసొస్తుందని వారి నమ్మకం. 

బిళ్వ పత్రాలతో ఎలా పూజించాలి?

శివుడిని భర్తగా పొందేందుకు పార్వతీ మాత తపస్సు చేసినట్లు శాస్త్రాలలో పేర్కొన్నారు. దీంతో పాటు ఉపవాసం ఉండి శివుడిని పార్వతీ దేవి ప్రసన్నం చేసుకుందని నానుడి. ఒకసారి శివుడు తాటిచెట్టు కింద కూర్చున్నాడు. శివుని పూజ కోసం తన సామగ్రిని తీసుకురావడం మర్చిపోయిన సమయంలో పరమ శివుడు కూర్చొన్న చెట్టుకు సంబంధించిన ఆకులతో పూజించింది. అప్పుడు ఆ పత్రాలతో అంతటి మహాశివుణ్ణి పూజించిన తర్వాత పార్వతీ దేవి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి బిళ్వ పత్రాలతో శివుడ్ని పూజించడం ఆనవాయితీగా వస్తుంది.  

బిళ్వ పత్రాల పూజ వల్ల కలిగే ప్రయోజనాలు

శివునికి ఇష్టమైన బిళ్వ పత్రాల ద్వారా పూజించడం వల్ల ఇంట్లో నెలకొన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే వివాహమైన జంటలు మహాశివరాత్రి నాడు శివునికి బిళ్వ పత్రాలు సమర్పించడం వల్ల వారి దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది. సంతానం ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. 

బిళ్వ పత్రాలను ఎలా సమర్పించాలి?

మహాశివరాత్రి రోజున 11 లేదా 21 బిళ్వపత్ర ఆకులను తీసుకోవాలి. మూడు ఆకులు కలిసి ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆకులను విడదీయరాదు. నీటితో లేదా పాలతో బిళ్వ పత్రాలను శుభ్రపరచాలి. ఆ తర్వాత వాటిపై గంధంతో 'ఓం' అని రాయాలి. ఆ తర్వాత బిళ్వ పత్ర ఆకులపై సుగంధ పరిమణళాలను చల్లి.. 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత బిళ్వ పత్రాలను శివుని ప్రతి వద్ద ఉంచి పూజించాలి. 

(నోట్: ఈ కథనంలో అందించిన సమాచారమంతా శాస్త్రాల ద్వారా, మత విశ్వాసాల ద్వారా గ్రహించబడినది. దీనిని పాటించే ముందు నిపుణుల సలహా పాటించడం మేలు. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  

Also Read: Phalguna Masam: ఫాల్గుణ మాసం వచ్చేసింది.. ఈ మాసంలో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం!

Also Read: Chanakya Niti: ఈ రెండు లక్షణాలు లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా వ్యర్థమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News