Shukra Gochar in January 2024: సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహాల్లో బుధుడి తర్వాత స్థానం శుక్రుడిది. ఇది చాలా ప్రకాశవంతమైన గ్రహం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శుక్రుడిని శుభకరమైన గ్రహంగా భావిస్తారు. శుక్రుడి గమనంలోని మార్పు ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. జనవరి 18న శుక్రుడు ధనస్సు రాశిలో సంచరించబోతున్నాడు. దీని కారణంగా మూడు రాశులవారి జీవితాల్లో సానుకూల మార్పు చోటుచేసుకోబోతున్నాయి. శుక్రుడు ధనస్సు రాశి ప్రవేశం ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్ర సంచారం ఈ 3 రాశులకు వరం
సింహరాశి 
సింహ రాశి వారికి శుక్ర సంచారం చాలా మేలు చేస్తుంది. మీ కెరీర్ లో ఊహించని మార్పు చూపుతారు. మీ వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటారు. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇదే మంచి సమయం. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 
వృషభం
శుక్రుడి రాశి మార్పు వృషభరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీ శాలరీలో పెరుగుదల ఉంటుంది. అంతేకకాకుండా ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆఫీసులో మీ పనికి బాస్ లేదా సీనియర్లు నుంచి ప్రశంసలు లభిస్తాయి. 
తులారాశి
శుక్రుడి గోచారం తులరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్తులు లాభపడతారు. పెయింటింగ్ లేదా సంగీతం వంటి కళాత్మక రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు పేదరికం నుండి బయటపడతారు. ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీరు మంచి డైట్ ఫాలోవ్వడం మంచిది. 


Also Read: Lohri 2024: లోహ్రీ పండగను ఎందుకు జరుపుకుంటారు? ఈ పండగ ప్రాముఖ్యత తెలుసుకోండి..


Also Read: Makar Sankranti 2024: 77 ఏళ్ల తర్వాత మకర సంక్రాంతి రోజు 2 ప్రత్యేక శుభయోగాలు..పండగ ప్రాముఖ్యత రెట్టింపు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter