Makar Sankranti 2024: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలు మకర సంక్రాంతి ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పండగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సూర్య గ్రహం ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం వల్లే మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. ఈ సంవత్సరం సూర్య గ్రహం జనవరి 15న రాశి సంచారం చేయబోతోంది. కాబట్టి అదే రోజు మకర సంక్రాంతిని జరుపుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ పండగ రోజు సూర్య భగవానుడిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఒక నమ్మకం.
జనవరి 14 అర్ధరాత్రి 02:42కి మకరరాశిలోకి సూర్యుడు సంచారం చేయబోతున్నాడు. జ్యోతిష్యం ప్రకారం ఈ సమయం ఉదయతిథిలోకి వస్తుంది. అందుకే ఈ ఏడాది జనవరి 14న కాకుండా 15వ తేదీన మకర సంక్రాంతిని జరుపుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం మకర సంక్రాంతి చాలా ప్రత్యేకంగా కానుంది. ఎందుకంటే పంచాంగం ప్రకారం, ఈసారి మకర సంక్రాంతి వరియాన్ శుభయోగం ఏర్పడబోతోంది. ఈ యోగం దాదాపు 77 సంవత్సరాల తర్వాత ఏర్పడిందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఈ సంవత్సరం మకర సంక్రాంతి సోమవారం రోజు వస్తోంది. కాబట్టి చాలా ప్రత్యేకమైనదని.. దాదాపు 5 ఏళ్ల తర్వాత మకర సంక్రాంతి సోమవారం రోజున రాబోతోందని నిపుణులు తెలిపారు. మకర సంక్రాంతి రోజు ఏర్పడబోతున్న ఈ ప్రత్యేక యోగం కారణంగా అనేక రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు. పంచాంగం ప్రకారం..సూర్యాస్తమయం తర్వాత సూర్యుడు తన రాశిని మార్చినప్పుడు జనవరి 15న మకర సంక్రాంతికి శుభ సమయంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ మకర సంక్రాంతి రోజు నుంచే ఖర్మలు కూడా ముగిసి పోతాయి. అయితే ఈ సంవత్సరం మకర సంక్రాంతి గుర్రంపై కూర్చుని వస్తోంది. దాని సహాయక వాహనంగా సింహం ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు?
సంక్రాంతిని కొత్త సంవత్సరంలో మొదటి పండగగా భావిస్తారు. ఈ సంవత్సరం మకర సంక్రాంతి రోజున వరియన్ యోగంతో పాటు రవియోగం కూడా ఏర్పడబోతున్నాయి. వరియాన్ యోగం మధ్యాహ్నం 02:40 గంటలకు ప్రారంభమవుతుంది. జనవరి 15న రాత్రి 11:10 వరకు కొనసాగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 77 ఏళ్ల తర్వాత మకర సంక్రాంతి శుభయోగంలో రాబోతోంది. కాబట్టి ఈరోజు పవిత్రమైన నది స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా సూర్యభగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter