TTD Aarjitha Seva Tickets: తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆర్జిత సేవా టీక్కెట్లను మార్చ్ 20 నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఆ వివరాలివీ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత సేవలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చ్ 20వ తేదీ ఉదయం పది గంటలకు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆర్జిత సేవా టికెట్ల కోసం భక్తులు..tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.


అయితే ప్రత్యేక రోజుల్లో అంటే పండుగ సందర్భాల్లో ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పురస్కరించుకుని కళ్యాణోత్సవరం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 10వ తేదీన శ్రీరామనవమి తోమాల, అర్చన, సహస్రదీపాలంకరణ సేవల్ని, ఏప్రిల్ 14 నుంచి 16 వరకూ కళ్యాణోత్సవరం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు, ఏప్రిల్ 15వ తేదీన నిజపాద దర్శనం సేవల్ని రద్దు చేస్తున్న టీటీడీ వెల్లడించింది. తిరుమల దర్శనార్ధం వచ్చే భక్తులు కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ లేదా రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి అని టీటీడీ తెలిపింది. భక్తుల ఆరోగ్యం, టీటీడీ ఉద్యగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని నిబంధనలకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.  


ఇక సుప్రభాతం, తోమాల, అష్టదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం, అర్చన టికెట్లకను ఆన్‌లైన్‌లో కేటాయించనున్నారు. మార్చ్ 20వ తేదీ ఉదయం 10 గంటల్నించి మార్చ్ 22వ తేదీ ఉదయం 10 గంటల వరకూ ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ టికెట్లు పొందినవారి జాబితాను మార్చ్ 22వ తేదీ ఉదయం వెబ్‌సైట్‌లో డిస్‌ప్లే చేయనున్నారు. అటు ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా కూడా సమాచారం అందిస్తారు. 


Also read: Today Horoscope March 19 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండాలి!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook