Tirumala Updates: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకవర్గం ఏర్పడ్డాక సమూలంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. వివిధ రకాల దర్శనాలకు సంబంధించి టోకెన్లు జారీ షెడ్యూల్ ప్రకటించింది. జనవరి వరకూ జరిగే కార్యక్రమాల వివరాలు అందించింది. భక్తుల సౌకర్యార్ధం ఎప్పటికప్పుడు ప్రకటన జారీ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమలలో జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఉచిత టోకెన్లు జారీ చేయనున్నారు. జనవరి 10,11,12 తేదీల్లో దాదాపు 1.20 లక్షల సర్వ దర్శనం టోకెన్లు జారీ కానున్నాయి. మూడ్రోజుల తరువాత మాత్రం ఎప్పటికప్పుడు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ పదిరోజుల్లో అంటే జనవరి 9 నుంచి 20 వరకూ శ్రీవారి దర్శనం ఉండదు. భక్తుల సౌకర్యార్ధం తిరుపతిలోని రామచంద్రపురం పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎంఆర్ పల్లి స్కూల్ , తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌తో కలిపి మొత్తం 91 కౌంటర్లలో టోకెన్లు జారీ చేస్తారు. సర్వ దర్శనం టోకెన్లు కావల్సిన భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందవచ్చని టీటీడీ ఈవో స్పష్టం చేశారు. 


కౌంటర్ల వద్ద ప్రత్యేకంగా క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. క్యూ లైన్లలో నిరీక్షించే భక్తులకు తాగునీరు, మురుగుదొడ్డి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. జనవరి 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమౌతాయి. గోవింద మాల భక్తులకు ప్రత్యేక టికెట్లు ఉండవని టీటీడీ వెల్లడించింది. 


Also read: Pandem Kollu: సంక్రాంతికి పందెం కోళ్లను ఎలా ట్రైన్ చేస్తారో తెలుసా ఒక్కో, కోడి ధర 2 లక్షలు పందెం 25 లక్షలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.