Hundi Collections: నిన్న Tirumala Temple హుండీకి భారీగా ఆదాయం: TTD అధికారులు
Tirumala Temple Hundi Collections | చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో రథసప్తమి నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రథసప్తమి నిర్వహణ ఏర్పాట్లపై టీటీడీ అధికారులు ఇటీవల సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. గతంలో తరహాలో భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకోకున్నా, హుండీకి మాత్రం భారీగా ఆదాయం సమకూరుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. బుధవారం నాడు తిరుమల(Tirumala Temple Latest Update) శ్రీవారిని 47,399 మంది భక్తులు దర్శించుకున్నారు.
Also Read: Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల పరిరక్షణకు అధికారులు పటిష్ట చర్యలు
నిన్న శ్రీవారి హుండీకి రూ.2.54 కోట్లు మేర భారీగా ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే కలియుగ దైవం శ్రీవారికి 18,767 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మరోవైపు సూర్య జయంతి(Surya Jayanti) సందర్బంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి (Rathasapthami) వేడుకను తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) అధికారులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు.
Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు
చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఇతర అధికారులు రథసప్తమి ఏర్పాట్లపై ఎప్పటికప్పుడూ రథసప్తమి ఏర్పాట్ల వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.
Also Read: 7th Pay Commission: ఎల్‌టీసీ అలవెన్స్ చెల్లింపులపై 7వ వేతరణ సంఘం గుడ్ న్యూస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook