Today Horoscope August 1 2022: మేషం ( Aries): కస్టపడి పని చేస్తే తప్పక విజయం సాధిస్తారు. చేసే పనిలో తడబాటు వద్దు. ఉపవాసం ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి కుటుంబం మద్దతుగా ఉంటుంది. ఆస్తి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల వాతావరణం ఉంది. ముఖ్యంగా వ్యాపారం రంగంలోని వారికి కలిసిరానుంది.  మీ పని తీరుకు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రను ప్లాన్ చేస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. త్వరలో ఆస్తి మీ పేరు మీదకి వచ్చే అవకాశం ఉంది. దుర్గ శ్లోకం చదవండి.


మిథునం (Gemini): మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపార రంగంలోని వారికి ఊహించని లాభాలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన పనులలలో ముందడుగేస్తారు. కుటుంబం కోసం ఏదైనా ప్లాన్ చేస్తారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.


కర్కాటకం (Cancer): ఆర్థిక లావాదేవీల్లో జరిగిన పొరపాటు సకాలంలో సరిదిద్దుకునే అవకాశం ఉంది. కీలక వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి.. అందరి ప్రశంసలు అందుకుంటారు. ఉన్నతాధికారులు మీ పనితీరుని మెచ్చుకునే అవకాశం ఉంది. ప్రయాణాలు చేస్తారు. తోటివారి సహకారం ఉంటుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది. 


సింహం (Leo): తలపెట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. డబ్బు సంపాదించే అవకాశాలు మీకు వద్దకు రానున్నాయి. కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలను పొందుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారు మంచి డీల్‌ని ఆశించవచ్చు. మానసికంగా, ఉల్లాసంగా ఉంటారు. విష్ణు నామస్మరణ మంచిది.


కన్య (Virgo): మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలు ఉండవు. బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. అనవసరఆందోళన వద్దు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి సమస్య మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దుర్గ స్తోత్రం పఠించాలి.


తుల (Libra): శుభకాలం నడుస్తోంది. పెట్టుబడి పెట్టడానికి మీకు డబ్బు అందుతుంది. ప్రణాళికాబద్దంగా ముందుకు సాగితే పనులు పూర్తిచేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. కుటుంబ సమేతంగా వెళ్లే విహారయాత్ర ఉత్సాహంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.


వృశ్చికం (Scorpio): ఆర్థిక రంగంలోని వారికి శుభకాలం నడుస్తోంది. బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీమీ రంగాల్లో ప్రశంసలు అందుకుంటారు. మీకు ప్రజాదరణ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివ నామస్మరణ చేస్తే మేలు.


ధనస్సు (Sagittarius): మధ్యమ ఫలితాలు ఉన్నాయి. కమీషన్ ఏజెంట్ల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. వృత్తి పరంగా మంచి ఆఫర్‌ను పొందే అవకాశం ఉంది. వాదప్రతివాదాల జోలికి పోరాదు. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబ బంధాలను బలోపేతం చేసుకునే సమయం ఇది. శని శ్లోకం చదవాలి.


మకరం (Capricorn): మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్తితులు బాధ కలిగిస్తాయి. ఓ శుభవార్త కుటుంబంలో ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది. ప్రతిఒక్కరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం చేయండి.


కుంభం (Aquarius): చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఊహించని లాభాలు ఉన్నాయి. తోటివారి సహకారంతో ఆటంకాలను అధికమిస్తారు. ఆరోగ్య సమస్యలు మీకు ఆందోళన కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆస్తి విషయంలో కొందరికి శుభవార్త అందే అవకాశం ఉంది. ఇష్టదైవ స్తోత్రాన్ని చదవడం మంచిది.


మీనం (Pisces): శుభకాలం నడుస్తోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకున్న పని నెరవేరుతుంది. క్రీడా కార్యకలాపాలను చేపట్టడం వల్ల మీకు శారీరకంగా ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొందరికి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.


Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం..ఇబ్బంది పడుతున్న వాహనదారులు..!


Also Read: అషు రెడ్డి అందాల వడ్డన.. జూనియర్ సామ్‌ని అలా చూసి పిచ్చెక్కిపోతున్న ఫాన్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook