Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం..ఇబ్బంది పడుతున్న వాహనదారులు..!

Hyderabad Rains: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది.

Written by - Alla Swamy | Last Updated : Jul 31, 2022, 08:42 PM IST
  • హైదరాబాద్‌లో మారిన వాతావరణం
  • ఏకధాటిగా భారీ వర్షం
  • రోడ్లన్నీ జలమయం
Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం..ఇబ్బంది పడుతున్న వాహనదారులు..!

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. గంట నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో నగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. వాహనదారులంతా ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో నగరవాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్‌పేట, లక్డీకపూల్ కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

షేక్‌పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్, కిస్మత్ పూరా, బండ్లగూడ, జాగీర్, గండిపేట, పుప్పాలగూడ, మణికొండ, అత్తాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఇటీవల కురిసిన వర్షాల నుంచి లోతట్టు ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. ఇవాళ మళ్లీ భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతాలన్నీ పూర్తిగా నీటిమయం అయ్యాయి. ఇటు జీహెచ్‌ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. సమస్యాత్మాక కేంద్రాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బందిని మోహరించారు. 

డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు సరి చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడురోజులపాటు వానలు పడనున్నాయి. వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.

ఎల్లుండి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. 4వ రోజు ములుగు, దుబ్బాక, ఖమ్మం, భూపాల్‌పల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఇదే వాతావరణం ఉండనుంది. మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, వరంగల్, వనపర్తి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఐదు రోజు కూడా కుండపోత వానలు పడనున్నాయి.

Also read:Revanth Reddy: మరో ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్‌..త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..!

Also read:Sourav Ganguly: గంగూలీ అభిమానులకు గుడ్‌న్యూస్..బ్యాట్ పట్టనున్న దాదా..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News