Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 07 జూన్ 2021 Rasi Phalalu, ఓ రాశివారికి నూతన ఉద్యోగావకాశాలు
Today Horoscope In Telugu 07 June 2021: శ్రీ ప్లవ నామ సంవత్సరం జూన్ 07వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది.
Today Horoscope In Telugu 07 June 2021: మేష రాశి
మేషరాశి వారిపై నేడు చంద్రుడి ప్రభావం ఉంటుంది. కనుక మీకు అన్ని శుభాలు కలుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కెరీర్ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. నేడు మీ కుటుంబం మీ అభిప్రాయాలను వినకపోవచ్చు. మీ పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
వృషభ రాశి
ఈ రోజు సృజనాత్మకతను ప్రదర్శించే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయడంతో ఖర్చులు అధికం కానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పనిచేసే చోట నూతన ఆలోచనలతో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. అనారోగ్య సమస్య బాధిస్తుంది. వాహనాలు కొనుగోలు చేయాలని భావిస్తారు.
Also Read: Hanuman Jayanthi 2021 Date: తిరుమలలో నేటి నుంచి 5 రోజులపాటు హనుమాన్ జయంతి ఉత్సవాలు
మిథున రాశి
నేడు మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. ఆర్థిక సమస్యలు తీరతాయి. పనిచేసే చోట మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపుగా ప్రమోషన్ లేదా వేతన పెంపు అవకాశాలు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు.
కర్కాటక రాశి
నేడు మీపై చంద్రుడి ప్రభావం ఉంటుంది. కనుక మీరు సులువుగా సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ఒంటరిగా ఉండటం మరియు ప్రేమకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
సింహ రాశి
విద్యార్థులు ఉన్నత చదువులు లేదా మీ అధ్యయనాలలో అదనపు దృష్టి పెట్టాలని భావిస్తారు. మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్య ఉంటే చర్చించి పరిష్కరించుకునేందుకు తగిన సమయం. మీరు సానుకూల వైఖరితో వ్యవహరిస్తారు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది. చాలా కాలం తరువాత మిత్రులను కలుసుకుంటారు.
Also Read: Sun Halo Spotted in Hyderabad: తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఆకాశంలో అద్భుతం, Photo Gallery
కన్య రాశి
చేపట్టిన పనులలో జాప్యం జరుగుతోంది. ఈ రోజు మీ అంతిమ లక్ష్యంపై దృష్టిసారించాలి. కుటుంబ పరిస్థితులు అంతగా అనుకూలించవు. వామనాల లాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. సృజనాత్మకతకు సంబంధించిన వాటి కోసం కొంత డబ్బు ఖర్చు చేయడానికి ఇది మంచి రోజు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలతో ఖర్చులు రెట్టింపు అవుతాయి.
తులా రాశి
మీకు నిన్నటి నుండి తగినంత నిద్ర రాలేదని మీకు అనిపిస్తుంది. మీరు ఆశించిన వార్తలు అందకపోవడమే అందుకు కారణం. కొన్ని అలవాట్లు దూరం చేసుకుంటారు. ఎక్కడ స్థిరపడాలనుకుంటున్నారు మరియు ఎవరితో ఉండాలి వంటి మీ దీర్ఘకాలిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
వృశ్చిక రాశి
చాలా రోజుల తరువాత కొందరు మిత్రులు మిమ్మల్ని కలుసుకుంటారు. మీరు ఆఫీసులో కొంతకాలం నుంచి ఏదైనా ప్రయత్నించాలనుకుంటే, ఈ రోజు తగిన సమయం. వివాహితులు ఒకరికొకరు సమయాన్ని కేటాయించడం వల్ల మీ మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆలయాలు సందర్శించాలని భావిస్తారు. వ్యాపారులు ఆశించిన ఫలితాలు అందుకుంటారు.
ధనుస్సు రాశి
ఈ రోజు కెరీర్ గురించి ఆలోచిస్తారు. ఈ కెరీర్ మీకు ప్రయోజనం కల్పించదనుకుంటే మీకు ఆసక్తి ఉన్న మరో రంగాన్ని ఎంచుకుంటారు. కొత్త కోర్సు తీసుకోవడానికి ప్రయత్నించండి. బంధువులు, స్నేహితుల నుంచి ఒత్తిడి అధికం అవుతుంది. అనుకోని పరిస్థితులలో కొన్ని ప్రయాణాలు వాయిదా పడతాయి. అధికంగా శ్రమించినా ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది.
Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి
మకర రాశి
మీ వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ తప్పిదం ఈ రోజు పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత ప్రయోజనాల కంటే టీమ్ ప్రయోజనం ముఖ్యమని భావించాలి. పని నుంచి కాస్త విరామం తీసుకుని కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతారు. వ్యాపారులు మార్పు కోరుకుంటారు. ప్రయాణాలు మాత్రం చేయకూడదు.
కుంభ రాశి
కుంభ రాశి వారు నేడు సోమరితనంగా అనిపిస్తుంది. పనుల నుంచి తప్పించుకోవాలని భావిస్తారు. కానీ మీలో పనిచేసే సత్తా ఉంది. ఆ విషయాన్ని మరువొద్దు. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయండి. నేడు కొన్ని శుభవార్తలు మీకు ఆనందాన్నిస్తాయి. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులు పెట్టుబడి కోసం ఎదురుచూస్తారు. కొన్ని పనులు పూర్తి చేస్తారు.
మీన రాశి
పనిచేసే చోట ఈ రోజు చాలా డిమాండ్ ఉంటుంది. కానీ మీరు ప్రశాంతంగా వాటిని పూర్తి చేస్తారు. ఇంట్లో పిల్లలు మీ నుంచి శ్రద్ధ కోరుకుంటారు. ప్రయాణాల కారణంగా ధన వ్యయం. డబ్బు కోసం కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. పనికి తగిన ఫలితం అందదు. కొన్ని విషయాలతో నిరాశకు లోనవుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook