Today Horoscope July 11 2022: మేషం ( Aries): వృత్తిపరమైన రంగంలో అనుకూల సమయం. ముఖ్య విషయాల్లో నిదానమే మీకు మేలుచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడొద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అధికమయ్యే అవకాశం ఉంది. ఇల్లు, ప్లాట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాల్లోని వారికి శుభఫలితాలు ఉన్నాయి. రుణం చెల్లించడం కొందరికి పెద్ద భారంగా ఉంటుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇల్లు, ప్లాట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. ఒక వ్యవహారంలో మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.


మిథునం (Gemini): ఆర్థిక రంగంలో స్థిరత్వం ఉంది. చిన్న ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇష్టదైవ నామాన్ని స్మరించాలి.


కర్కాటకం (Cancer): అని రంగాల వారికి మంచి సమయం నడుస్తుంది. మీ ప్రతిభకు తగిన ఉద్యోగం వస్తుంది. మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో అభిప్రాయబేదాలు రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠించాలి. 


సింహం (Leo): నిపుణుడితో పెట్టుబడుల గురించి చర్చించడం మంచిది. వ్యాపార రంగంలోని వారు అప్రమత్తంగా ఉండండి. ప్రయాణ విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. స్నేహితుడు లేదా బంధువు మిమ్మల్ని విహారయాత్రకు ఆహ్వానించవచ్చు. శివారాధన శుభప్రదం.


కన్య (Virgo): వ్యాపార రంగంలోని వారు అనుకున్నది సాధిస్తారు. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. విరామం కోరుకునే వారు విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. త్వరలో ఆస్తిని సొంతం చేసుకునే అవకాశం ఉంది. అనూహ్య ధనలాభాన్ని పొందుతారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తే బాగుంటుంది.


తుల (Libra): అనుకూల సమయం నడుస్తోంది. కీలక విషయాల్లో పెద్దల సహకారం తీసుకోవడం ఉత్తమం. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా ఉండండి. అనవసర భయాందోళనలకు గురికావొద్దు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త శని ధ్యానం శుభప్రదం.


వృశ్చికం (Scorpio): శుభకాలం నడుస్తోంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒక శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. అనూహ్య ధనలాభాన్ని పొందుతారు. ఇష్టదైన ప్రార్థన శుభ ఫలితాలు ఇస్తుంది.


ధనస్సు (Sagittarius): మిశ్రమ కాలం నడుస్తోంది. శారీరక శ్రమ పెరుగుతుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా ఉండండి. శివనామాన్ని జరిపించాలి.


మకరం (Capricorn): మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. బిల్డర్లుకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. ఒక వార్త మీ కుటుంబంలో ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్ట దైవాన్ని పూజించడం లాభదాయం. 


కుంభం (Aquarius): శుభకాలం నడుస్తోంది. ఐ రంగాల్లోని వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అనుకోని ధనలాభం ఉంది. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.


మీనం (Pisces): మిశ్రమ వాతావరణం నడుస్తోంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నాయి. కొన్ని సమస్యలు తప్పవు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ప్రయాణంలో జాగ్రత్త. శత్రువులకు దూరంగా ఉండండి. దుర్గాస్తుతి పఠించాలి.


Also Read: Telangana Weather Updates: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. హెచ్చరికలు


Also Read: Agent Teaser: అప్పటి నుంచి దేశం మొత్తం వెయిట్ చేస్తుంది.. ఏజెంట్ టీజర్ ప్రకటన!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook