Telangana Rain updates: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టి వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీరు దిగువకు వదులుతున్నారు. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో పలు చోట్ల రహదారులపైకి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో రహదారులు తెగి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నిన్నటి ఉపరితల ఆవర్తనం మరియు ఈస్ట్‌వెస్ట్ షీర్ జోన్ ఈ రోజు 20°N వెంబడి సముద్రం మట్టానికి 3.1 కి.మీ నుండి 5.8 కి మీ ఎత్తు వరకు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా వ్యాపించి ఉంది.
ఇక ఇదిలావుంటే, రానున్న మరో మూడు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒడిషాతో పాటు అక్కడి తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం నేడు దక్షిణ ఒడిషా మరియు ఉత్తర ఆంధ్రా తీర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. దానికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్రమట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉండగా.. ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంపు తిరిగినట్టు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఈ రోజు రుతుపవన ద్రోణి బికనీర్, శిఖర్, శివపురి, సత్నా, జర్సుగూడ అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వ్యాప్తించి ఉంది. సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తమ ప్రకటనలో పేర్కొంది. వాతావరణంలో ఈ మార్పుల కారణంగా రాగల మూడు రోజులు పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains in Hyderabad) కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్పష్టంచేశారు.
Also Read : CM Kcr on PM Modi: దేశానికి బీజేపీ పీడ పోవాలి..ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ ఫైర్..!
Also Read : HYDERABAD RED ALERT: హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్.. హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్.. ఎవరూ బయటికి రావొద్దన్న సీపీ
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook