Today Horoscope July 13 2022: మేషం ( Aries): పూర్తిగా మిశ్రమ కాలం నడుస్తోంది. ప్రతి పనిలో ఆటంకాలు పెరుగుతాయి. వృత్తిపరమైన అవకాశాన్ని కొందరు కోల్పోతారు. ముఖ్య పనులను వాయిదా వేయడం మంచిది. బంధువుల సహకారం అందుతుంది.  గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. నవగ్రహ ధ్యానం శుభాన్ని ఇస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): ఈరోజు అన్ని రంగాల వారికి శుభకాలం. పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందగలరు. ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు. కీలక వ్యవహారాల్లో  తొందరపాటు పనికిరాదు. అవసరానికి మించి ఖర్చులు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలను పెండింగ్‌లో ఉంచండి. మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. హనుమత్ ఆరాధన శుభప్రదం.


మిథునం (Gemini): ఆర్థిక విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ నిబద్ధతే మీ విజయానికి మూలం. కొన్ని ముఖ్యమైన పని లేదా నిర్ణయాన్ని వాయిదా వేయడం మంచిది. అనవసరమైన  విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఒత్తిడికి లోనవకుండా ముందుకు సాగితే అంతా మేలు జరుగుతుంది. స్నేహితులతో ప్రయాణం చాలా వినోదాన్ని కలిగిస్తుంది. విష్ణు నామస్మరణ శుభప్రదం.


కర్కాటకం (Cancer): సంపాదన అవకాశాలు మీకు రావచ్చు. మీ పని తీరుపై ఉన్నతాధికారులు హెచ్చరించే అవకాశం ఉంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు.  కుటుంబ సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కరించబడుతుంది. విద్యా వ్యవహారాలు ఫలిస్తాయి. శ్రీనివాస సందర్శనం శుభప్రదం.  


సింహం (Leo): శుభకాలం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. డబ్బు ఆదా చేయడానికి ఓ మార్గం కనబడుతుంది. ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శ్రమకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.
హనుమాన్ చాలీసా చదవాలి.


కన్య (Virgo): చేపట్టే పనిలో అలసట పెరుగుతుంది. మీరు ఒక ప్రధాన వస్తువును కొనుగోలు చేస్తారు. మీ పై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలను స్వీకరిస్తారు. మానసిక ఒత్తిళ్లను దూరం చేసుకోగలుగుతారు. ఇంట్లోని వాతావరణం బాగుంటుంది. శివారాధన శుభప్రదం.


తుల (Libra): ఈరోజు మీరు చేపట్టిన ప్రతి పనిలో రాణించగలరు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి. విద్యారంగంలో కొన్ని మార్పులు ఆశించవచ్చు. ప్రేమికులు విజయం సాధిస్తారు. గణపతి ఆరాధన చేస్తే మంచిది.


వృశ్చికం (Scorpio): ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. పెద్దల సూచనలను అనుసరించడం ద్వారా విజయం సాధిస్తారు. చేపట్టిన పనులలో విజయావకాశాలు ఉన్నాయి. బంధు, మిత్రులతో విబేధాలు రావచ్చు. దుర్గా శ్లోకం చదవాలి.


ధనస్సు (Sagittarius): మిశ్రమ కాలం నడుస్తోంది. అన్ని పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. విద్యారంగంలో అనుకూలమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. గోవిందనామాలు చదవడం మంచిది.


మకరం (Capricorn): ప్రారంభించిన పనులలో జాప్యం లేకుండా చూసుకోవాలి. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉన్నాయి. తోటివారి సూచనలు పని చేస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. స్నేహితులతో బయటికి వెళ్లడం ఉత్సాహంగా ఉంటుంది. విష్ణు సహస్రనామాలు వినడం మంచిది.


కుంభం (Aquarius): శుభకాలం నడుస్తోంది. అన్ని రంగాల వారికి కలిసొచ్చే కాలం. మనఃస్సౌఖ్యం కలదు. పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. ప్రేమికులు విజయం సాధిస్తారు. కులదైవ సందర్శనం మంచిది.


మీనం (Pisces): అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని పెంచే విధంగా ఉంటాయి. పనులలో కొన్ని సానుకూల మార్పులు ఊహించబడతాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు. సూర్యభగవానుని సందర్శనం మేలు చేస్తుంది.


Also Read: ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే.. స్వేచ్ఛగా వదిలేయగల ప్రేమే ఎంతో గొప్పది: నాగ‌ చైత‌న్య


Also Read: మహిళకు ముద్దులు, హగ్గులు ఇచ్చిన రెండు సింహాలు.. వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!  


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook