Today Horoscope March 11 2022: మేషం ( Aries): ప్రారంభించబోయే పనులు త్వరగా పూర్తయ్యే విధంగా ప్రణాళికను సిద్ధం చేయండి. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్యహృదయం చదవడం మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది. బంధువులు, కుటుంబ సభ్యులతో  వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. గొడవలకు దూరంగా ఉండాలి. లేదా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.


మిథునం (Gemini): ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ.. పట్టుదలతో అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వాలి. కీలక విషయాల్లో ఇతరుల సూచనలు తీసుకోండి. శివారాధన శుభప్రదం.


కర్కాటకం (Cancer): ఆశించిన ఫలితాలు మీ సొంతం అవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు. ప్రయాణాలు చేస్తారు. శని శ్లోకాన్ని చదివితే మంచిది.


సింహం (Leo): భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఓ పనిలో ఓటమి ఎదురవుతుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.


కన్య (Virgo): ఆశించిన ఫలితాలు మీ సొంతం అవుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. మీకు ఇష్టమైన దైవారాధన మానవద్దు.


తుల (Libra): ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.


వృశ్చికం (Scorpio): ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. అనవసరమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. గణపతి స్తోత్రం చదవండి.


ధనస్సు (Sagittarius): ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇతరుల మాట అస్సలు వినొద్దు. సాయి నామాన్ని జపించాలి.


మకరం (Capricorn): కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ప్రయాణాలు చేస్తారు. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.


కుంభం  (Aquarius): మనోధైర్యం విజయాలను అందిస్తుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేరారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.


మీనం (Pisces): ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురైనా.. అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది.


Also Read: కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే.. మీ ఉద్యోగాలు మీ ఇంటికే... : నిరుద్యోగ యువతకు రేవంత్ పిలుపు


Also Read: Kartik Aaryan: ''రూ. 20 కోట్లు ఇస్తా...నన్ను పెళ్లి చేసుకుంటావా?''.. ప్రపోజల్‌కు ఓకే చెప్పిన హీరో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook