Todays Horoscope: గ్రహాల కదలికల్ని బట్టి రాశిఫలాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. ఇవాళ మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆ రాశివారికి మాత్రం అన్నీ అనుకూలమే ఇవాళ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక పోటీ ప్రపంచంలో సైన్స్ ఎంతగా అభివృద్ది చెందుతున్నా జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్లు కూడా ఎక్కువే. జ్యోతిషశాస్త్రం కూడా ఓ సైన్స్ అని చెబుతారు మరికొందరు. ప్రతిరోజూ తమ తమ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి కూడా ఉంటుంది. ఈ నేపధ్యంలో మీమీ రాశిఫలాలు(Rasi phalalu)ఎలా ఉన్నాయో చూద్దాం. 


మేష రాశి : ఈ రాశివారికి అన్నీ అనుకూలంగానే ఉంటాయి. అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా ఆర్ధికంగా బాగుంటుంది. పలు కీలకమైన వ్యవహారాల్లో అందరితో ప్రశంసలు అందుకుంటారు. 


వృషభ రాశి : ఈ రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇవాళ. కుటుంబసభ్యులతో పరిస్థితులు బాగుంటాయి. ఆర్ధిక, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించడం మంచిది.


మిథున రాశి : ఈ రాశివారికి ప్రతికూల పరిస్థితులుండవు. అన్నీ సానుకూలంగానే జరుగుతాయి. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపారులకు సరైన అవకాశాలు లభిస్తాయి. తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాల్ని ఇస్తాయి. ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. 


కర్కాటక రాశి : ఈ రాశివారికి(Zodian Signs) ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా ఫరవాలేదు. మిశ్రమంగా ఉండవచ్చు. కుటుంబసభ్యులతో జాగ్రత్తగా ఉంటే వివిధ రకాల సమస్యల్నించి దూరం కావచ్చు. అధికారుల్నించి మద్దతు లభిస్తుంది. సమస్యలు తగ్గుతాయి. 


సింహ రాశి : ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్ధికంగా బాగుంటుంది కానీ ఆరోగ్యపరంగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. మీరు ఎంచుకున్న రంగాల్లో ఫలితాలు బాగుంటాయి. 


కన్య రాశి : ఈ రాశివారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా అన్నీ సానుకూలంగానే ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పూర్తిగా మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో బాగుంటుంది. 


తుల రాశి : ఈ రాశివారికి పరిస్థితులు పూర్తిగా అనుకూలంగానే ఉంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్దికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. 


వృశ్చిక రాశి : ఈ రాశివారికి సైతం పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా అనుకున్నవి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. 


ధనుస్సు రాశి : ఈ రాశివారికి వ్యాపారపరంగా బాగుండి..ఆర్ధికంగా ప్రయోజనం చేకూరుతుంది. ఆరోగ్యపరంగా ఏ విధైన సమస్యలుండవు. బంధుమిత్రులతో బాగుంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి.


మకర రాశి : ఈ రాశివారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఏ విధమైన సమస్యలు ఉండకపోవచ్చు. చేయాల్సిన పనులు పూర్తవడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. 


కుంభ రాశి : ఈ రాశివారికి మాత్రం పూర్తిగా ప్రతికూలంగా ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా ఇబ్బందులుంటాయి. చేయాల్సిన పనులు నిలిచిపోతాయి. తీసుకునే నిర్ణయాల ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. 


మీన రాశి : ఈ రాశివారికి ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. నిర్ణయాలు తీసుకునేముందు కుటుంబసభ్యులతో చర్చించడం మంచిది. ఆర్ధికంగా లాభాలు కలుగుతాయి. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో బాగుంటుంది. 


Also read: Subramanya Swamy Shasti : అక్కడ మొక్కులు చెల్లిస్తే సంతానం గ్యారెంటీ అట.. రేపటి నుంచే అత్తిలిలో షష్ఠి ఉత్సవాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook