COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tomorrow Surya Grahan Timing In India 2023: ఈ సంవత్సరంలోని రెండవ, చివరి సూర్యగ్రహణం అక్టోబర్‌ 14 తేది శనివారం సంభవించబోతోంది. ఇదే రోజు సర్వపిత్రి అమావాస్య కూడా ఏర్పడబోతోంది. అయితే ఇదే రోజు శనివారం కావడం వల్ల గ్రహణం రోజున శని అమావాస్య కూడా వస్తుంది. సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్త తెలుపుతున్నారు. అయితే ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం కారణంగా ఏర్పడే సూతకాల వివరాలు, ఈ గ్రహణానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


సూర్యగ్రహణం సమయం:
ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14 శనివారం రాత్రి 08:34 గంటలకు ప్రారంభమవుతుందని ఖగోళ శాస్త్రవేత్త తెలుపుతున్నారు. తెల్లవారు జామున 02:25 గంటల కంటే ముందే ముగిసే అవకాశాలున్నాయి.


సూర్యగ్రహణం కనిపిస్తుందా:
ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం..ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదని..దీని కారణంగా ఎలాంటి సూతక కాలం కూడా చెల్లదు. ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం కన్యారాశి, చిత్ర నక్షత్రాలలో జరుగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటే, మరికొన్ని రాశులవారికి తీవ్ర సమస్యలు రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


ఇక్కడే గ్రహణం కనిపిస్తుంది:
దక్షిణ అమెరికా ప్రాంతాలు మినహా అన్ని దేశాల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర అమెరికాతో పాటు కెనడా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, మెక్సికో, క్యూబా, కొలంబియా, ఆంటిగ్వా, జమైకా, హైతీ, పరాగ్వే, బ్రెజిల్, బహామాస్‌ దేశాల్లో కనిపిస్తుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


సూర్యగ్రహణం సూతక కాల సమయం:
సూర్యగ్రహణం సూతక కాలం 12 గంటల ముందు ప్రారంభమవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.సూతకాల కాల సమయంలో పూజలు నిషేధించడం ఆనవాయితిగా వస్తోంది. అంతేకాకుండా ఈ సమయంలో దేవాలయ తలుపులు కూడా మూసివేస్తారు. అయితే ఈ సంవత్సరం చివరి గ్రహణం భారతదేశంలో కనిపించలేకపోవడం కారణంగా సూతక్ కాలం కూడా చెల్లదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


రాశులవారిపై గ్రహణం ప్రభావం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఈ గ్రహణం సంభవించడం వల్ల మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మేషం, కర్కాటకం, తుల, మకర రాశి వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం