Mahashivratri 2024 today: మహాశివరాత్రి నాడు త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులకు శివుడి అనుగ్రహం..
Mahashivratri 2024: ఈ రోజే మహాశివరాత్రి. ఈ పవిత్రదినాన కుంభరాశిలో త్రిగ్రాహి యోగంతోపాటు శివయోగం, సిద్ధయోగం, సర్వార్థ సిద్ధి యోగం వంటి యోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా మూడు రాశులవారి ఫేట్ మారబోతుంది.
Mahashivratri 2024 Rashi Phalalu: హిందువులకు మహాశివరాత్రి చాలా ప్రత్యేకం. ఈరోజున శివభక్తులు అందరూ శివారాధాన చేస్తారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 08న వచ్చింది. ఈరోజు ఆస్ట్రాలజీ పరంగా అద్భుతంగా ఉండబోతుంది. మహాశివరాత్రి నాడు కొన్ని గ్రహాల కలయిక ఏర్పడుతోంది. ఈరోజున కుంభరాశిలో శని, శుక్ర, సూర్యుని కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. పైగా ఇదే రోజు శివయోగం, సిద్ధయోగం, సర్వార్థ సిద్ధి యోగం, శ్రావణ నక్షత్రం, ధనిష్ఠ నక్షత్రాలు కూడా ఏర్పడుతున్నాయి. మరోవైపు కుజుడు, చంద్రుడు మకరరాశిలో ఉండడం వల్ల లక్ష్మీయోగం రూపొందుతుంది. ఇన్ని శుభ యోగాలు కలయిక మూడు రాశులవారికి కలిసిరానుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
తులా రాశి
ఈ రోజు నుండి తులరాశి వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కాబోతున్నాయి. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీరు ఊహించని విధంగా డబ్బు వచ్చిపడుతుంది. మీరు భారీగా స్థిర చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభించడంతోపాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది.
మేష రాశి
మహాశివరాత్రి నాడు ఏర్పడబోతున్న శుభ యోగాలు మేషరాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. మీ కెరీర్ దూసుకుపోతుంది. మీరు ఈ రోజు ఏ పని చేపట్టినా అది సక్సెస్ అవుతోంది. వ్యాపారస్తులు భారీగా లాభాలను గడిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
వృషభ రాశి
వృషభరాశి వారికి మహాశివరాత్రి నుండి అదృష్టం పట్టనుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉంటూ వస్తున్న ప్రమోషన్ ఈసారి వస్తుంది. ఏదైనా పని లేదా వ్యాపారం మెుదలుపెట్టడానికి ఇదే మంచి సమయం. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో టూర్ కు వెళ్లే అవకాశం ఉంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి