Trigrahi Yog: మిథునరాశిలో త్రిగ్రాహి యోగం.. మరో 5 రోజుల్లో ఈ రాశులవారిపై కనకవర్షం!
Trigrahi Yog: ఈ నెలలో మిథునరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది. ఒకే రాశిలో 3 గ్రహాల కలయిక ప్రభావం మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Shukra Gochar Effect on Zodiac Signs: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల కలయిక రాశిచక్ర గుర్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మిథునరాశిలో సూర్యుడు, బుధుడు ఉన్నారు. త్వరలో ప్రేమ, శృంగారాని కారణమైన శుక్రుడు కూడా మిథునరాశిలోకి (Trigrahi Yoga in Gemini 2022) ప్రవేశించనున్నాడు. మిథునరాశిలో ఈ మూడు రాశుల సంయోగం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావం 3 రాశులవారికి శుభఫలితాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
వృషభం (Taurus): త్రిగ్రాహి యోగం వల్ల వృషభరాశి వారు లాభపడతారు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాలు పరిష్కరించబడతాయి. అకస్మిక ధనలాభం ఉంటుంది. పెండింగ్లో ఉన్న డబ్బులు మీకు అందుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్థులకు లాభాలు మెండుగా ఉంటాయి.
సింహం (Leo): త్రిగ్రాహి యోగం వల్ల సింహ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కొత్త మార్గాల్లో డబ్బు వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వృత్తి-వ్యాపారాల్లో విజయం సాధిస్తారు.
కన్య (Virgo): మిథునంలోని త్రిగ్రాహి యోగం వల్ల వీరి కెరీర్ అద్భుతంగా ఉంటుంది. మీ జీతం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు ఇది అనుకూల సమయం. విదేశాల్లో పని ఉన్నవారు దాని ద్వారా బాగా డబ్బు గడిస్తారు.
Also Read: Venus Transit Effect: జూలై 13న మిథునరాశిలోకి శుక్రుడు... ఈ రాశులవారికి బంఫర్ బెనిఫిట్స్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook