Sarva Darshan Tokens In Tirumala: శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు పునఃప్రారంభం
Sarva Darshan Tokens in Tirupati | పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పునఃప్రారంభించింది. నిన్న ప్రకటించినట్లుగానే భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా Tirumala శ్రీవారి సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తున్నారు.
TTD resumes Sarva Darshan Tokens | ఏపీలోని చిత్తురు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పునఃప్రారంభించింది. నిన్న ప్రకటించినట్లుగానే భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా Tirumala శ్రీవారి సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తున్నారు. ఒకరోజు ముందుగానే శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. ఈరోజు టోకెన్లు పొందిన భక్తులు మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు.
ప్రతిరోజు మూడు వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి తెలిపింది. సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు ఉదయం 5 గంటల నుంచి భక్తులు బారులు తీరారు. కరోనా పాజిటివ్ కేసులు రావడంతో సెప్టెంబర్ 6న నిలిపివేసిన సర్వదర్శనం టోకెన్ల జారీని నేడు తిరిగి ప్రారంభించారు. ఈ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారినే అలిపిరి నుంచి కొండపైకి అనుమతి ఇవ్వనున్నట్లు వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe