Tulsi Plant Home Remedy: తులసి ఆకులతో ఈ ప్రత్యేక పరిహారం చేస్తే.. రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులు అవుతారు! ట్రై చేయండి
If You want immense money Do These Remedy with Tulasi Leaves. తులసి ఆకులతో ఈ ప్రత్యేక పరిహారం చేస్తే లక్ష్మీదేవి మరియు ధన కుబేరుల ఆశీర్వాదాలు మీపై ఉంటాయి. రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులు అవుతారు.
Tulasi Leaves Home Remedies: హిందువులు పవిత్రంగా భావించే మొక్కలలో 'తులసి' ఒకటి. అందుకే దాదాపుగా ప్రతి ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది. తులసి మొక్క ఇంట్లో ఉండటం చాలా శుభసూచకం అని వేదశాస్త్రం చెబుతోంది. అలానే తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా హిందువులు భావిస్తారు. అంతేకాదు మహావిష్ణువుకు కూడా తులసి చాలా ప్రీతికరమైనది. తులసి మొక్కని నిత్యం పూజించడం వల్ల లక్ష్మీదేవి మరియు విష్ణువు అనుగ్రహం పొందవచ్చు. దాంతో ఇంట్లో సిరిసంపదలు వెల్లువెత్తుతాయి.
మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే.. తులసి మొక్క చాలా సహాయకారిగా ఉంటుంది. తులసి ఆకులకు సంబంధించిన ఓ పరిహారం లేదా నివారణ వేదశాస్త్రంలో చెప్పబడింది. దీన్ని చేయడం ద్వారా లక్ష్మీదేవి మరియు ధన కుబేరుల ఆశీర్వాదాలు మీపై ఉంటాయి. ధన లాభమే కాదు ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులు కూడా తొలగిపోతాయి. భారీ ధనం సంపాదించేందుకు కొత్త మార్గాలు తెరవబడతాయి. ఆ ప్రత్యేక పరిహారం ఏంటో చూద్దాం.
11 తులసి ఆకులను తుంచాలి:
బ్రహ్మ ముహూర్తంలో ఏ రోజైనా సరే ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. తరువాత తులసి మాతకు ప్రార్థన చేసి.. 11 ఆకులను తుంచాలి. ఆకులు తుంచిన తర్వాత చేతులు జోడించి తులసి మాతని క్షమించమని అడగండి. ఆకులు చిరిగిపోకూడదని గుర్తుంచుకోండి. ఇక 11 తులసి ఆకులను శుభ్రమైన నీటితో కడిగి.. చిన్న ముక్కలుగా కట్ చేయి. ఈ ముక్కలను పిండితో ఉన్న పాత్రలో వేయండి.
పిండితో రోటీలు, పరాటాలు:
ప్రతిరోజూ తులసి ఆకులు ఉన్న పిండితో రోటీలు, పరాటాలు ఏదైనా చేసుకోవచ్చు. అయితే ఈ పిండితో రోటీలు తయారు చేసేటప్పుడు పూర్తి స్వచ్ఛత పాటించాలని మాత్రం గుర్తుంచుకోండి. అంటే స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పిండిని తాకాలి. రోటీలు తయారు చేసి తులసి మాతకి పెట్టి మీరు తినాలి. ఇలా చేయడం ద్వారా త్వరలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతేకాదు ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది.
ఈ పొరపాట్లు చేయకూడదు:
ఈ పరిహారం చేసేటప్పుడు ఈ పొరపాట్లు మాత్రం చేయకూడదు. ఆదివారం, బుధవారం మరియు ఏకాదశి నాడు ఈ పరిహారం చేయకూడదని మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో తులసి ఆకులను తుంచడం లేదా తులసిని తాకడం లాంటివి వేదశాస్త్రంలో నిషేధించబడింది. ఈ పరిహారం చేయడానికి ఉత్తమ రోజు గురువారం లేదా శుక్రవారం.
Also Read: Virat Kohli: బంగ్లా ప్లేయర్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.