Scientific Reason Behind Ugadi: ఉగాది తెలుగువారి కొత్త సంవత్సరం. ఈ పండుగ వసంత ఋతువులో వస్తుంది. ఈ ఋతువులో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఈ వేడి వల్ల చాలా మంది జ్వరాలు, ఆటలమ్మ వంటి వ్యాధుల బారిన పడతారు.ఈ వ్యాధుల వల్ల చాలా మంది మరణిస్తుంటారు. దీని కారణంగా మన ఋషులు ఈ కాలాన్ని "యమద్రంస్టలు" అని పిలిచేవారు. యమద్రంస్టలు అంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మందిని నాశనం చేస్తాడని అర్థం.కాబట్టి ఈ కాలంలో జనం ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. ఉగాది వెనుక ఉన్న వైజ్ఞానిక అంశం కూడా ఇదే. అందుకే మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఉగాది పచ్చడి లాంటి ఆహారాలను తయారు చేసుకొని తింటాము.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉగాది పచ్చడి  వైజ్ఞానిక అంశం:


ఉగాది పచ్చడి ఒక రుచికరమైన వంటకం మాత్రమే కాదు, దాని వెనుక చాలా వైజ్ఞానిక కారణాలు కూడా ఉన్నాయి. దీని తీసుకోవడం వల్ల ఈ కాలం వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం. 


ఉగాదిలో పచ్చడి ఆరోగ్య లాభాలు: 


వేప పూత: 


వేప పూతలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.


మామిడి పచ్చ: 


మామిడి పచ్చలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.


చింతపండు: 


చింతపండులో ఉండే యాసిటిక్ ఆమ్లం జీర్ణక్రియకు సహాయపడుతుంది.


ఖర్జూరం: 


ఖర్జూరంలో ఐరన్, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిని పెంచడంలో సహాయపడతాయి.


బెల్లం: 


బెల్లం శరీరానికి వేడిని ఇస్తుంది.


మిరియాలు, ఉప్పు: 


మిరియాలు, ఉప్పు రుచిని మెరుగుపరచడమే కాకుండా జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి.


ఈ ఉగాది పచ్చడిని ఒక్క ఉగాది రోజు మాత్రమే కాకుండా ఉగాది మొదలుకొని శ్రీ రామనవమి లేదా చైత్ర పౌర్ణిమ వరకు ప్రతిరోజూ తీసుకోవడంఆరోగ్యానికి మంచిది. ఈ విధంగా తొమ్మిది లేదా పదిహేను రోజుల పాటు ఉగాది పచ్చడి తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి, ఆ సంవత్సరం మొత్తం రోగాలు దరిచేరవు.


ఉగాది పచ్చడిలో వాడే వేపపువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి, ఆటలమ్మ, అమ్మోరు వంటి వ్యాధులను దగ్గరకు రానీయదు. మామిడి యాంటీ-వైరల్ లక్షణాలను కలిగి ఉండి, కఫము, వాతము, పైత్యము అనే మూడు దోషాలను అదుపులో ఉంచుతుంది. మనకు వచ్చే చాలా రోగాలు ఈ మూడు దోషాల వల్లనే వస్తాయి. కాబట్టి, ఉగాది పచ్చడిని ఒక ఆచారంగా మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారంగా కూడా భావించి ఈ సంవత్సరం ఉగాది నుంచి శ్రీ రామనవమి లేదా చైత్ర పౌర్ణిమ వరకు ప్రతిరోజూ తీసుకోవడం మంచిదని నిపుణులు, పండితులు చెబుతున్నారు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి