Upcoming Lucky Zodiac Signs: జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు సంచారం చేయడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలలో గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. దీని కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశులవారి జీవితాల్లో దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఖగోళ శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన గ్రహం బుధుడు ఈ నెల 14న కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని ప్రభావం కారణంగా కొన్ని రాశులవారికి ఎలాంటి పనులు చేసిన సులభంగా మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. బుధుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయడం వల్ల ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంచారం కారణంగా లాభాలు పొందే రాశులవారు వీరే:
వృషభ రాశి:

 ఈ సంచారం కారణంగా వ్యాపారాలు చేసేవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో విస్తరణ కూడా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సోదరుల మద్ధతు కూడా లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో శుభ కార్యాలు కూడా జరిగే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ సంచారం లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు విదేశి ప్రయాణాలు కూడా చేసే ఛాన్స్‌ ఉంది. ఈ సంచారంతో వాహాలు కూడా కొనుగోలు చేస్తారని నిపుణులు చెబుతున్నారు.


Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం


కర్కాటక రాశి:
ఈ సంచారం కర్కాటక రాశిలోనే జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వీరికి ఆత్మవిశ్వాసం పెరిగి ఎలాంటి పనులైన సులభంగా చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రుల మద్ధతు లభించి అనుకున్న పనులన్ని చేయగలుగుతారు. ఉద్యోగాలు చేసేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ సంచారం కారణంగా కర్కాటక రాశివారు ప్రమోషన్స్‌ కూడా పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ లాభాలు కూడా పొందే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


వృశ్చిక రాశి:
వృశ్చిక రాశివారికి కూడా  బుధుడి సంచారం కారణంగా అనుకున్న పనులు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మద్ధతు లభించి దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా పొందుతారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ బుధుడి సంచారం వల్ల ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా కుటుంబ జీవితంలో ఆనందం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  వ్యాపారంలో స్నేహ సంబంధాలు కూడా మెరుగుపడే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook