Vara Rasi Phalalu In Telugu: ఈ వారం రాశి ఫలాలు..6 రాశులవారికి తిరుగులేదు ఇక..
Rasi Phalalu Weekly 12 February To 18 February 2024: ఈ వారం కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు గ్రహాలు నక్షత్ర సంచారాలు చేయడం వల్ల కొన్ని రాశులవారు అనుకోకుండా లాభాలు పొందే ఛాన్స్ కూడా ఉంది.
Rasi Phalalu Weekly 12 February To 18 February 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెలలోని రాబోయే వారం కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీంతో కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటే, మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగే ఛాన్స్ ఉంది. అలాగే ఈ సమయంలో కొన్ని గ్రహాలు నక్షత్ర సంచారం కూడా చేయబోతున్నాయి. దీంతో ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ వారం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
ఫిబ్రవరి నెలలో జరిగే నక్షత్ర సంచారాల కారణంగా మేష రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారాల్లో అనుకున్న లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఎలాంటి పనులైనా కష్టపడి చేయడం వల్ల సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు యువత ఎక్కువగా సోషల్ మీడియాలో సమయం గడపకుండా ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా పరిమితికి మించిన డబ్బులు ఖర్చు పెట్టకపోవడం చాలా మంచిది.
వృషభ రాశి:
వృషభ రాశి ఈ వారం అంకిత భావం పెరుగుతుంది. అంతేకాకుండా ఎంతో ఆలోచనాత్మకంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కష్టపడి పని చేయడం వల్ల ప్రమోషన్స్ కూడా పొందే ఛాన్స్ ఉంది. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారు కూడా ఈ సమయంలో సులభంగా లాభాలు పొందుతారు. దీంతో పాటు పెద్ద క్లయింట్‌తో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. అలాగే విద్యార్థులకు కూడా ఈ సమయం ఎంతో మేలు జరుగుతుంది.
సింహరాశి:
సింహరాశి వారికి కూడా ఈ వారం చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పూర్వీకుల వ్యాపారాలు కొనసాగిస్తున్నవారు ఈ సమయంలో తండ్రుల, స్నేహితుల సపోర్ట్ కూడా పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు స్నేహితులతో ఈ సమయంలో రహస్యాంగా ఉండడం చాలా మంచిది.
కన్యా రాశి:
ఈ వారం కన్యా రాశివారు కూడా ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు వీరు భవిష్యత్ ప్రణాళిక పొందుతారు. వ్యాపారాలు చేస్తున్నవారు కొత్త వ్యాపారాలు ప్రారంభించే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు వీరు ఈ వారం ఎంతో జాగ్రత్తగా ఉండడం కూడా చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
తులారాశి:
తుల రాశి వారికి కూడా ఈ వారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. సహోద్యోగుల నుంచి మద్దతు లభించి కార్యాలయాల్లో మంచి పేరు పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా అధిక శాతం లాభాలు వచ్చే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు యువతి, యువకుల ప్రేమ వివాహాల్లో పెద్దలు కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నాలు చేసే ఛాన్స్ కూడా ఉంది. అలాగే తీవ్రంగా శ్రమించడం వల్ల ఆశించని విజయాలు కూడా సాధిస్తారు. దీంతో పాటు ప్రతి విషయంలో అతిగా ఆలోచించడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter