Vasantha panchami 2022: ఈ రోజే వసంత పంచమి- సరస్వతి పూజకు శుభముహూర్తం ఇదే..
Vasantha panchami 2022: రేపు వసంత పంచమి. ఈ రోజుకు (వసంత పంచమికి) అంత ప్రాధాన్యత ఎందుకు? ఎలాంటి పనులు చేయాలి? అనే వివరాలు మీకోసం.
Vasantha panchami 2022: ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజును వసంత పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతిని మాతను పూజిస్తారు. ప్రాంతాల వారీగా ఈ పర్వదినాన్ని రకరకాల పేర్లతో జరుపుకుంటారు.
సరస్వతీ జయంతి, మదన పంచమి, శ్రీపంచమి పేర్లతో కూడా ఈ పర్వదినం ప్రాచుర్యం పొందింది.
సరస్వతి దేవికి సంబంధించిన పర్వదినం కావడంతో ఈ రోజు విద్యార్థులకు ముఖ్యమైన రోజుగా చెబుతుంటారు ఆధ్యాత్మిక గురువులు. కొందరు ఈ రోజు ఉపవాసం ఉంటారు మరికొందరు పేదలకు విద్యకు సంబంధించిన వస్తువులు దానం చేస్తారు.
కాలాల్లోనూ మార్పులు..
సాధారణంగా వసంత పంచమి తర్వాత.. వాతావరణంలోనూ మార్పులు వస్తుంటాయి. ఈ రోజు తర్వాత చలికాలం ప్రభావం తగ్గి.. వేసవి కాలం ఆరంభం అవుతుంది.
వసంత పంచమి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
ఫిబ్రవరి 5 (శనివారం) ఉదయం 3.48 గంటలకు వసంత పంచమి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఉదయం 3.46 గంటల వరకు ఉంటుంది.
వసంత పంచమి శుభ ముహూర్తం శనివారం ఉదయం 7.19 గంటల నుంచి మధ్యాహ్నం 12.35 వరకు ఉంటుంది. ఈ 5 గంటల 28 నిమిషాల పాటు సరస్వతి పూజలు చేసేందుకు శుభ సమయాలుగా చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్తలు.
వసంత పంచమి రోజు చేయాల్సిన. చేయకూడని పనులు..
వసంత పంచమి రోజున బ్మహ్మ చర్యాన్ని పాటించాలి
మనసులో ఎవరు పట్ల తప్పుడు బావన ఉండకూడదు
మాట్లాడే మాటల్లో దూషణ సంబందమైన పదాలను వాడకూడదు
మాసాహారాన్ని ముట్టుకోకూడదు. మద్యపానం సేవించరాదు
స్నానం చేయకుండా ఆహారం తినకూడదు
పసుపు రంగులో ఉన్న బట్టలు దరించడం వల్ల మేలు జరుగుతుంది
ఇది కాలం మారే రోజు కాబట్టి.. చెట్లను నరకడం, మెక్కలు పీకేయడం వంటివి చేయకూడదు.
Also read: Home Vastu Tips: గుమ్మంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయొద్దు.. చేస్తే అరిష్టమే..
Also read: Numerology Predictions: ఏయే తేదీల్లో పుట్టినవారికి ఇవాళ కలిసొస్తుంది.. న్యూమరాలజీ ఏం చెబుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook