Home Vastu Tips for Ants: మీ ఇంట్లో నలుపు, ఎరుపు చీమలు ఉన్నాయా.. ఏవి శుభమో, ఏవి అశుభమో తెలుసుకోండి?
What does it mean when you see a lot of ants in your house. ఇంట్లో ఉండే ఎర్ర లేదా నల్ల చీమలు.. మనిషి జీవితంలో జరిగే శుభ, అశుభ సంకేతాలను ముందే చెపుతాయని వాస్తుశాస్రంలో చెప్పబడింది.
Black Ants or Red Ants in house is good or bad: తేమ, ధూళి మరియు ఆహార పదార్థాలు ఉన్న ప్రదేశాలలో చీమలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ప్రతి ఇంట్లో కూడా చీమలు ఉండడం సర్వసాధారణం. చీమలను ఇంట్లో నుంచి పంపేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అయితే ఇంట్లో ఉండే ఎర్ర లేదా నల్ల చీమలు.. మనిషి జీవితంలో జరిగే శుభ, అశుభ సంకేతాలను ముందే చెపుతాయని వాస్తుశాస్రంలో చెప్పబడింది. ఇంట్లో చీమలు నిష్క్రమించే దిశ, వాటి ప్రవర్తనతో.. మీరు భవిష్యత్తులో డబ్బు సంపాదించబోతున్నారా లేదా డబ్బును కోల్పోబోతున్నారా అని ముందే తెలుస్తుంది.
ఇంట్లో ఎర్ర చీమలు ఉంటే:
ఇంట్లో అకస్మాత్తుగా ఎర్రటి చీమలు కనిపించడం మంచిది కాదు. ఇంట్లో ఎర్రటి చీమలు కనిపిస్తే.. మీరు డబ్బు కోల్పోతారని సంకేతం. అలానే మీరు రుణం తీసుకోవలసి ఉంటుందని సూచిస్తుంది. ఇంట్లో ఎర్రటి చీమలు పదే పదే కనిపిస్తే.. డబ్బు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఇష్ట దేవతను పూజించాలి. ఎర్రటి చీమలు రాకుండా ఉండాలంటే.. లవంగాలు, నిమ్మకాయ, కర్పూరం మొదలైన వాటిని ఆ ప్రదేశంలో ఉంచండి.
ఇంట్లో నల్ల చీమలు ఉంటే:
ఇంట్లో నల్ల చీమలు అకస్మాత్తుగా కనిపించడం చాలా శుభప్రదం. నల్ల చీమల రాక ఉంటే.. మీ జీవితంలో సంతోషకరమైన సమయం రాబోతుందని అర్ధం. మీ కెరీర్‌లో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. డబ్బు లాభదాయకంగా ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. పాత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంట్లో నల్ల చీమలు బయటకు పోతున్నట్లయితే.. పిండి, పంచదార వేయండి.
చేపలు, పక్షులకు ఆహారం:
జ్యోతిషశాస్త్రంలో చిన్న చిన్న జీవులకు సంబంధించిన కొన్ని ప్రభావవంతమైన పరిహారాలు ఉన్నాయి. ఇంటి బయట చీమల కోసం పిండి మరియు చక్కెర పోయాలి. ఇది కాకుండా ఇంటిముందు పక్షులకు ఆహారం మరియు నీరు పెట్టండి. అలానే చేపలకు ఆహారం వేయండి. దీంతో కొద్ది రోజుల్లోనే మీ సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి.
Also Read: Venus Transit 2022: శుక్ర సంచారం.. ఈ రాశుల వారికి నూతన సంవత్సరంలో ప్రమోషన్‌తో పాటు ధనలాభం!
Also Read: 2023లో అత్యంత అదృష్ట రాశులు ఇవే.. వద్దన్నా డబ్బు మీ ఇంట్లోకి వస్తుంది! మీ రాశి ఉందో చూసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.