2023 Lucky Zodiac Signs: 2023లో అత్యంత అదృష్ట రాశులు ఇవే.. వద్దన్నా డబ్బు మీ ఇంట్లోకి వస్తుంది! మీ రాశి ఉందో చూసుకోండి

Aquarius, Gemini, Leo, Libra and Scorpio Signs will be most luckiest in 2023. 2023 ఈ 5 రాశుల వారికి చాలా అదృష్టంగా మారనుంది. డబ్బు మరియు సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 15, 2022, 10:14 AM IST
  • 2023లో అత్యంత అదృష్ట రాశులు ఇవే
  • వద్దన్నా డబ్బు మీ ఇంట్లోకి వస్తుంది
  • మీ రాశి ఉందో చూసుకోండి
2023 Lucky Zodiac Signs: 2023లో అత్యంత అదృష్ట రాశులు ఇవే.. వద్దన్నా డబ్బు మీ ఇంట్లోకి వస్తుంది! మీ రాశి ఉందో చూసుకోండి

Lucky Zodiac Signs 2023, These 5 Zodiac Signs will be most lucky in 2023 Year: 2022 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. కొత్త సంవత్సరం 2023 ఆరంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో సహజంగానే కొత్త ఏడాది తమకు అదృష్టం వరిస్తుందా? లేదా? అనే ఉత్సుకత అందరిలోనూ ఉంటుంది. అయితే వార్షిక జాతకం ప్రకారం..  కొన్ని రాశుల వారికి 2023 అద్భుతంగా ఉండనుంది. 2023 సంవత్సరంలో గ్రహాలు మరియు రాశుల స్థానం.. ఈ 5 రాశుల వారికి చాలా అదృష్టంగా మారనుంది. డబ్బు మరియు సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. 2023 సంవత్సరంలో ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథునం: 
2023వ సంవత్సరం మిథున రాశి వారికి చాలా అదృష్టమని చెప్పాలి. జనవరి తర్వాత వీరికి మంచి సమయం ప్రారంభమవుతుంది. కొత్త అవకాశాలు భారీ లాభాలను తెస్తాయి. మీ ఆదాయం భారీగా పెరుగుతుంది. సమాజంలో ఉన్నత స్థానం పొందుతారు. గౌరవం పెరుగుతుంది. 

సింహం: 
2023 జనవరి 17న శని సంచరించిన వెంటనే సింహ రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగ-వ్యాపారాలలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ రంగం వారికి ప్రయోజనం ఉంటుంది. భారీగా ఆదాయం పెరుగుతుంది. అహంకారాన్ని మానుకోండి.

తులా: 
తులా రాశి వారికి 2023 సంవత్సరం శుభప్రదంగా ఉండనుంది. ఇప్పటివరకు ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. జీవితంలో మీరు ఆశ్చర్యపోయే ఆహ్లాదకరమైన మార్పులు వస్తాయి. చాలా డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక పరిస్థితిలో గొప్ప ఉపశమనం ఉంటుంది. మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోండి.

వృశ్చికం: 
వృశ్చిక రాశి వారికి 2023 సంవత్సరంలో ఆదాయం పెరుగుతుంది. అయిదు ఖర్చులు కూడా పెరుగుతాయి. అందుకే బడ్జెట్‌పై శ్రద్ధ వహించాలి. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. ఆహ్లాదకరమైన ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. 2023 వృశ్చిక రాశి వారికి  ఆనందం, శ్రేయస్సు మరియు శాంతిని ఇస్తుంది.

కుంభం: 
2023లో కుంభ రాశి వారికి బృహస్పతి సంచారం అదృష్టంను కలిగిస్తుంది. ప్రతి పనిలో విజయం ఉంటుంది. ఊహించని ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ నుంచి కూడా కుంభ రాశి వారు లాభపడతారు. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. 

Also Read: తులసి, మనీ ప్లాంట్‌లను ఇంట్లో ఈ దిక్కున పెడితే అష్టదరిద్రం.. లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్లిపోతుంది!  

Also Read: Saturn Transit 2023: కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారికి రాజయోగం.. 2025 వరకు రెండు చేతులా డబ్బు సంపాదిస్తారు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News