Artificial Flowers: ఇళ్లు ఎంత అందంగా ఉంటే..మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇంటి అలంకరణకు వివిధ రకాల మొక్కలు, పూలు వినియోగిస్తుంటారు. అదే సమయంలో ఆర్టిఫిషియల్ పూలు ప్రతి అలంకరణలో తప్పకుండా కన్పిస్తాయి. అయితే వీటివల్ల దివాళా తీసేస్తారని హెచ్చరిస్తున్నారు జ్యోతిష్య పండితులు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటి అలంకరణలో ఆర్టిఫిషియన్ పూలే ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైనా ఇదే పరిస్థితి. తెలిసో తెలియకో ఇంటి అందం కోసం ఆర్టిఫిషియల్ పూలు అమర్చుతుంటాం. అయితే ఇలా ఆర్టిఫిషియల్ పూలు వినియోగించడం వల్ల దివాళా తీస్తారని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు. 


వాస్తవానికి ఆర్టిఫిషియల్ పూలతో ఇంటిని అలంకరించడం వల్ల నిజంగానే ఇంటికి అందం వస్తుంది. ఏళ్ల తరబడి పాడవకుండా కూడా ఉంటాయి. అయితే వాస్తు ప్రకారం ఈ పద్ధతి మంచిది కాదంటున్నారు వాస్తు పండితులు. ఆర్టిఫిషియల్ పూల వల్ల ఇంట్లో నెగెటివ్ శక్తులు రావడమే కాకుండా..ఇంట్లో దుష్ప్రభావం కూడా పడుతుందట. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ పూలతో కలిగే ప్రయోజనాలేంటి, దుష్ప్రభావమేంటో పరిశీలిద్దాం..


ఫేంగ్‌షుయీ అంటే చైనా వాస్తు ప్రకారం ఒకవేళ ఇంట్లో ఆర్టిఫిషియల్ పూలు ఉంచితే..అది పూర్తిగా అశుభంగా భావిస్తారు. వీటివల్ల ఇంట్లో నెగెటివ్ శక్తి ప్రసరిస్తుంది. ఇంట్లో నకిలీ పూలు పెట్టడం వల్ల ఆ ఇంట్లో కన్పించే ఆనందంలో కూడా నకిలీ ఉంటుందట. కుటుంబసభ్యుల్లో బేధాభిప్రాయాలు ఉత్పన్నమౌతాయి. ఇంట్లో ఆర్టిఫిషియల్ పూల వల్ల షోయింగ్, అబద్దాలు చెప్పడం ఎక్కువవుతుంది. 


ఆర్టిఫిషియల్ పూలే కాకుండా వాడిపోయిన పూలు కూడా ఇంట్లో ఎప్పుడూ పొరపాటున కూడా పెట్టకూడదు. ఇది చాలా అశుభ సూచకం. వీటివల్ల ఇంట్లో ఆనందాలు మాయమౌతాయి. కుటుంబసభ్యుల వైఖరిలో ఎక్కువగా విసుగు కన్పిస్తుంది. ఆర్టిఫిషియల్ పూల వల్ల ఇంట్లో మహిళల ఆరోగ్యంపై కూడా నెగెటివ్ శక్తులు ప్రసరిస్తాయి. మహిళల్లో ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైన సమస్యలు ఉత్పన్నమౌతాయి.


Also read: Bhadli Navami 2022: భడ్లీ నవమి ఎప్పుడు? దీని ప్రాధాన్యత ఏంటి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook