Vastu Tips: వాస్తు ప్రకారం దక్షిణ దిశలో పెట్టకూడని మొక్కలు..
Vastu for Plants:ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇండోర్ ప్లాంట్స్ మైంటైన్ చేయడం బాగా అలవాటైపోయింది. గాలిని స్వచ్ఛంగా ఉంచడంతోపాటు ఇంటిని ఎంతో ప్రశాంతంగా ఉంచుతాయి అన్న భావనతో నచ్చిన ఇండోర్ ప్లాంట్స్ ను తెచ్చి ఇంటి నిండా అలంకరిస్తున్నారు .అయితే ఇలా చేయడం వల్ల వాస్తు పరమైన కొన్ని దోషాలు తలెత్తే అవకాశం ఉంది అని మీకు తెలుసా.
Vastu Tips:ఇంట్లో మొక్కలు పెంచుకోవడం ప్రతి ఒక్కరికి ఇష్టమే ..కానీ ఎలాంటి మొక్కలు పెంచుకుంటాం అనే విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో ..ఆ మొక్కలను ఏ దిశలో పెడుతున్నాం అనే విషయంపై కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి అంటున్నారు వాస్తు నిపుణులు. ఇలా చేయకపోవడం వల్ల లాభాల మాట అటు నుంచి అనవసరమైన ఇక్కట్లు ఎదుర్కొనే ఆస్కారం కూడా ఉందట .మరి ఆ మొక్కలు ఏమిటి ఏ దిశలో పెట్టకూడదు తెలుసుకుందాం పదండి.
వాస్తు ప్రకారం దక్షిణ దిశలో పెంచకూడని మొక్కలు మూడు.. తులసి, మనీ ప్లాంట్, అరటి. మరి వాటి వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం..
1. తులసి :
అందరూ ఇళ్లలో నిత్యం పూజలు అందుకునే మొక్క తులసి మొక్క. ఎంతో పవిత్రంగా భావించే ఈ మొక్కలో లక్ష్మీదేవి స్వయంగా నివాసం ఉంటుంది భక్తులు నమ్ముతారు అందుకే ఈ మొక్కకు రోజు భక్తిశ్రద్ధలతో పూజ చేస్తారు. అలాంటి తులసి మొక్క దక్షిణ దిశలో ఉండడం వల్ల ఇంటిలో ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. అందుకే తులసి మొక్కను ఎప్పుడు కూడా ఉత్తరం లేక ఈశాన్యం దిశలో ఉండేలా చూసుకోవాలి.
2. మనీ ప్లాంట్:
మనీ ప్లాంట్ ఈ చెట్టు లోనే మనీ ఉంది కాబట్టి ఇది ఇంట్లో ఉండడం శుభప్రదం అని భావించే వాళ్ళు కొందరు ఉన్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ ఉండడం శుభానికి సూచన. కానీ అది దక్షిణ దిశలో అసలు ఉండకూడదు. అలా ఉండడం వల్ల ఆర్థిక సమస్యలతో పాటు మానసికమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. మనీ ప్లాంట్ ఎప్పుడు కూడా ఆగ్నేయ దిశలోనే ఉండాలి.
3. అరటి చెట్టు:
ప్రస్తుతం చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి ఇంట్లో చాలా రకాల చెట్లు పెంచుతున్నారు వాటిలో అరటి చెట్టు కూడా ఒకటి. అరటి చెట్టు ఉన్న ప్రదేశంలో మంచి జరుగుతుంది అని అంటారు కానీ అది దక్షిణ దిశలో అసలు ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల మానసికమైన చికాకులు ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ఎప్పుడు కూడా అరటి మొక్కను ఉత్తరం లేక తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం మొక్కలకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. నియమాల ప్రకారం కొన్ని మొక్కలను నిర్దిష్ట దిశలో కాకుండా వేరొక దిశలో పెంచడం వల్ల గొడవలు, ఆర్థిక సమస్యలు ,ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో మూడు మొక్కలను దక్షిణ దిశలో అస్సలు నాటకూడదు అని చెబుతారు. ఇంటిని అలంకరించడానికి మనకు వాస్తు కూడా కాస్త తెలిసి ఉండడం ఎంతో అవసరం. ఎందుకంటే వాస్తుకు విరుద్ధంగా చేసే పనుల వల్ల ప్రభావం మన జీవితం పైనే పడుతుంది. కాబట్టి మనకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవడంలో ఎటువంటి తప్పులేదు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు
Also read: India Covid Cases Today: ఒక్క రోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మొత్తం ఎన్ని కేసులంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook