వాస్తు అనేది ఇంటికైనా, ఆఫీసుకైనా చాలా అవసరమంటున్నారు జ్యోతిష్య పండితులు. ముఖ్యంగా వాస్తుదోషం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇంటికి వాస్తు అనేది లేకపోతే..దారిద్ర్యం వెంటాడుతుంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..సుఖ సంతోషాలు, ప్రశాంతతకై వాస్తు తప్పనిసరి. ఇల్లైనా, కార్యాలయమైనా వాస్తు చాలా అవసరం. ఇంట్లో వాస్తు సరిగ్గా లేకపోతే..కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఇంట్లో వాస్తు విషయంలో కొన్ని విషయాలపై దృష్టి పెడితే సుఖమైన జీవితం లభిస్తుంది. ఇంట్లోని వాస్తుదోషం సంబంధిత వ్యక్తి వద్ద డబ్బులు ఆగవు. ఎంత ప్రయత్నించినా డబ్బులు సంపాదించలేరు. అందుకే ఇంట్లో మూడు చోట్ల వాస్తు పక్కాగా ఉండాలంటున్నారు.


ఇంటి ఉత్తర దిశ..వాస్తుశాస్త్రం ప్రకారం ఇటి ఉత్తర దిశకు విశేష ప్రాధాన్యత ఉంది. ఇంటి ఉత్తర దిశ అనేది కుబేరుడు లేదా ధన దేవతకు ఆవాసం. అందుకే ఈ దిశ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. ఆర్ధికపరమైన విషయాలకు ఉత్తర దిశ శుభప్రదంగా ఉంటుంది. వాస్తు పండితుల ప్రకారం..ఇంటి ఉత్తర దిశగా అశుభ్రంగా ఉంటే..కుబేరుడికి కోపమొస్తుంది. నెమ్మది నెమ్మదిగా ఆ వ్యక్తి దివాళా తీస్తాడు. 


ఇంటి టాయ్‌లెట్ కూడా శుభ్రంగా ఉండాలి. ఇటీవలి కాలంలో చాలామంది టాయ్‌లెట్లు కూడా ఆధునికంగా మల్చుకుంటున్నారు. కానీ వాస్తు ప్రకారం నిర్మించాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంటి టాయ్‌లెట్ నిర్మాణం లేకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. వాస్తు ప్రకారం ఇంటి టాయ్‌లెట్‌ను దక్షిణ లేదా పశ్చిమ దిశలో నిర్మించాలి. ఇంట్లో టాయ్‌లెట్ ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంటే..ఆ వ్యక్తి ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఇంట్లో డబ్బులు కూడా ఖర్చయిపోతుంటాయి.


ఇంట్లో నీళ్ల ట్యాంకు విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. వాస్తు ప్రకారం నీళ్ల ట్యాంకు అమర్చుకోవడం తప్పనిసరి అంటున్నారు వాస్తు పండితులు. ఇంటి ట్యాంకును ఎప్పుడూ దక్షిణం లేదా తుర్పు దిశలో ఉంచడం మంచిది కాదంటున్నారు. మిగిలిన తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచడం మంచిది. ఈ సూచనలు పాటించకపోతే జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు జ్యోతిష్య పండితులు.


Also read: Dream Science: ఈ జీవులు మీకు కలలో కనిపిస్తే... మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook