Tulsi Vastu Tips: ఈ విధంగా తులసి మెుక్కను నాటితే.. ఇక చూస్కోండి మీ ఇంటి నిండా డబ్బే డబ్బు..!
Tulsi Vastu Tips: ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శ్రేయస్కరం. కానీ తులసి మొక్కను నాటేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
Tulsi Vastu Tips In Telugu: తులసి మొక్కను హిందువుల దేవతగా పూజిస్తారు. తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. తులసి మొక్క ఉన్నచోట పాజిటివిటీ ఉంటుంది. అందుకే ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటారు. ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల ఆనందంతోపాటు అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాస్తు శాస్త్రంలో కూడా తులసికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని నాటేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి.
తులసిని నాటడం ఎలా?
>> ఇంట్లో తులసి మొక్కను నాటడానికి గురువారం అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజు తులసిని నాటడం వల్ల మీకు విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా మీ జాతకంలోని బృహస్పతి గ్రహం బలపడి శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. దీని వల్ల మీకు ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది.
>> శుక్రవారం కూడా తులసి మొక్కను నాటడం మంచిది. ఎందుకంటే ఈ రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభిస్తాయి.
>> ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారు శనివారం నాడు తులసి మొక్కను నాటడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
>> సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఏకాదశి మరియు ఆదివారం కూడా పొరపాటున తులసి మొక్కను నాటవద్దు. ఈ కాలంలో తులసిని తాకడం నిషిద్ధమని భావిస్తారు. లేకపోతే అదృష్టం కూడా దురదృష్టంగా మారుతుంది.
>> కార్తీక మాసంలో తులసి మొక్కను నాటడం చాలా శ్రేయస్కరం. అంతేకాకుండా నవరాత్రులలో (ముఖ్యంగా చైత్ర మాస నవరాత్రులు) ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా మంచిది.
>> తులసి మొక్కను నాటడానికి సరైన దిశ కూడా చాలా ముఖ్యం. ఇంట్లో ఉత్తర దిశలో తులసి మొక్కను ఉంచండి. ఇది వీలుకాకుంటే దానిని తూర్పు మరియు ఈశాన్యంలో కూడా ఉంచవచ్చు. కానీ దక్షిణ దిశలో ఎప్పుడూ ఉంచవద్దు. దీనివల్ల నష్టం జరుగుతుంది.
>> తులసి మొక్కను నైరుతి దిశలో ఉంచవద్దు. ఇలా చేస్తే జీవితంలో ఇబ్బందులు వస్తాయి.
Also Read: Sun-Mercury Conjunction in Cancer: కర్కాటక రాశిలో బుధాదిత్య యోగం.. ఈ 4 రాశులవారికి అపారమైన లాభం!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook