Morepankhi Plant Benefits:  ఇంటిని ఎన్నో రకాల మెుక్కలను ఉపయోగించి అలంకరిస్తాం. ఇందులో కొన్ని మెుక్కలు ఇంట్లోకి సానుకూలతను తీసుకొస్తాయి. వాస్తులో ఇలాంటి మెుక్కలు చాలా చెప్పబడ్డాయి. ఇవీ ఇంటికి సానుకూలతను తీసుకురావడమే కాకుండా కుటుంబసభ్యులు పురోగతికి తోడ్పడతాయి. ఇలాంటి మెుక్కలలో నెమలి ప్లాంట్ (Morepankhi Plant) ఒకటి. దీన్ని ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంట్లో నెమలి మొక్కను ఇలా నాటండి
>> వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు ఇంట్లో నెమలి చెట్టును నాటబోతున్నట్లయితే, దానిని ఎల్లప్పుడూ జంటగా నాటాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది.
>> ఈ మొక్క పెరుగుదలకు సూర్యరశ్మి అవసరం. అందుకే మొక్కకు సూర్యరశ్మి లభించే విధంగా ఇంటి ఉత్తర దిశలో ఉంచండి.
>> ఈ మెుక్కను ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచాలి.
>> ఇంట్లోని సభ్యులను రోగాల బారిన పడకుండా కాపాడేందుకు కూడా మొక్క దోహదపడుతుంది. ఈ మొక్క ఎండిపోయినట్లయితే వెంటనే దానిని మార్చాలి మరియు మరొకదానితో కలిపి నాటాలి.


నెమలి మెుక్క ప్రయోజనాలు
>> ఇంట్లో నెమలి చెట్టు లేదా విదియ మొక్కను నాటడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి నశిస్తుంది. అంతే కాదు కుటుంబసభ్యుల మధ్య టెన్షన్ పడే పరిస్థితి లేదు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. 
>> దీనితో పాటు, ఈ మొక్క ఇంట్లో వచ్చే అనర్థాలను ఇంట్లోకి రానివ్వదని కూడా నమ్ముతారు. ఇది ఇంట్లో ఆనందం మరియు శాంతిని కలిగిస్తుంది మరియు కుటుంబ సభ్యుల ఆర్థిక స్థితిని బలపరుస్తుంది.
>> ఈ మొక్కకు చాలా సానుకూల శక్తి ఉందని నమ్ముతారు. దీన్ని జంటగా నాటడం వల్ల ఇంటి సభ్యుల తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి. ఈ మెుక్క పని చేయాలనే ఫీలింగ్, పిల్లల మనస్సు చురుకుగా మరియు చదువుపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. 


Also Read: Ashadha Amavasya 2022: ఆషాఢ అమావాస్య రోజున ఈ 5 పరిహారాలు చేయండి.. సర్ప దోషం నుండి విముక్తి పొందండి! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.