Vastu Tips: ఇంట్లో ఏయే రకాల మొక్కలు ఉండకూడదు, వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది
Vastu Tips: ఇంటికి మొక్కలు, చెట్లు అందాన్ని, ఆహ్లాదాన్నిస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు శుభసూచకమైతే..మరికొన్ని అశుభసూచకం. ఇంట్లో ఏయే రకాల మొక్కల్ని పెంచకూడదు, వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది.
Vastu Tips: ఇంటికి మొక్కలు, చెట్లు అందాన్ని, ఆహ్లాదాన్నిస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు శుభసూచకమైతే..మరికొన్ని అశుభసూచకం. ఇంట్లో ఏయే రకాల మొక్కల్ని పెంచకూడదు, వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది.
ఇంట్లో మొక్కలు చెట్లతో పాజిటివ్ ఎనర్జీ లేదా నెగెటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. కానీ మొక్కలనేవి ఏ మొక్కలైనా సరే ఇంటికి అందాన్ని, ఆహ్లాదాన్నిస్తాయనేది అందరూ చెప్పేమాట. వాస్తుశాస్త్రం మాత్రం మొక్కలనేవి సౌభాగ్యంతో పాటు దుర్భాగ్యాన్ని కూడా మోసుకొస్తాయిట. అందుకే కొన్ని రకాల మొక్కల్ని పెంచకూడదని వాస్తుశాస్త్రం గట్టిగా చెబుతోంది. కొన్ని రకాల మొక్కల్ని ఇంటి ఆవరణలో ఉంచకూడదట. ఒకవేళ పెంచితే..జీవితంలో దౌర్భాగ్యంతో పాటు సమస్యలు కొనితెచ్చుకున్నట్టవుతుందట. ఏయే రకాల మొక్కల్ని పెంచకూడదో తెలుసుకుందాం..
చింతచెట్టు చూడ్డానికి బాగుంటుంది కానీ ఇంటి ఆవరణలో ఉండకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం చింతచెట్టనేది చెడు శక్తులకు నిలయం. దీనివల్ల జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. చింతచెట్టు వల్ల కుటుంబ బంధాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. కేక్టస్ జాతి మొక్కలు కూడా ఇంట్లో ఉండకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం ముళ్లున్న మొక్కలు ఇంట్లో ఉండకూడదు. గులాబీ మొక్కలకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉంది.
ఇక పత్తి మొక్క కూడా మంచిది కాదంటున్నారు వాస్తు నిపుణులు. ఇంట్లో లేదా ఇంటి పరిసరాల్లో ఉండకూడదట. దీనివల్ల నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇక కుండీల్లో మొక్కల విషయంలో కూడా వాస్తుశాస్త్రంలో సూచనలున్నాయి. మొక్కలు చిన్నవైనా లేదా పెద్దవైనా సరే..ఉత్తర, తూర్పు దిశల్లో మొక్కల కుండీల్ని వ్రేలాడదీయకూడదు. ఇది అశుభసూచకమట. ఇక చివరిది గోరింటాకు మొక్క. ఆధ్యాత్మికం ప్రకారం గోరింటాకు చాలా మంచిది. కానీ గోరింటాకు మొక్కలు మాత్రం ఇంట్లో ఉండకూడదు. దీనివల్ల కుటుంబసభ్యులపై నెగెటివ్ ప్రభావం పడుతుందట.
Also read: Horoscope Today May 10 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారి కోరిక నేడు నెరవేరనుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook